అడ్డొస్తే.. అంతే..?

ఆయనకు అడ్డొస్తే అంతే. ఆయన వ్యాపారానికి అడ్డుతగిలితే ఇక అంతే. ఎవర్ని ఎక్కడ నొక్కాలో 
స్కెచ్ రెడీగా ఉంటుంది. ఇక రాజకీయ ముసుగు ఎలాగూ తగిలించుకునే ఉంటుంది. సో.. ఆయనకు అడ్డురాకండి.? వస్తే.. లైఫ్ అంతా తుస్సే.! నగరంలో బ్లాక్ మార్కెట్ లో జరిగిపోతున్న గుట్కా వ్యాపారానికి అండర్ వరల్డ్ డాన్ లా మారిపోయిన షాడో రాజకీయ అధికార ప్రతినిధి కధ ఇది. 


డోన్ట్ టచ్..!
అదేదో సినిమాలో సినీనటుడు మోహన్ బాబు డైలాగ్ ఉంటుంది. ఫసక్ అని. ఇప్పుడు ఇదే మాట ఆ అధికార ప్రతినిధి నోట వస్తోందట. గుట్కా వ్యాపారమంత తన కన్ను సన్నల్లోనే నడవాలని ఆయన ఇప్పటికే హుకుం జారీ చేసిండ్రట. ఇదేదో భలేగా ఉందే అంటే అంతేమరి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం ఎవరికి కలిసొచ్చిందో తెలియదు కానీ.. ఆయనకు మాత్రం మూడు గుట్కాలు.. ఆరు ఖైనీలుగా నడిపోతోందని టాక్. ఆయనకు అడ్డువచ్చిన పాత డాన్ లను తొక్కేసి.. ఈయన మరో అండర్ వరల్డ్ డాన్ గా మారిపోయాడని భోగట్టా. ఇదేం పెద్ద మేటర్ కాదని.. పట్టించుకోకుండా తిరిగిన ఓ "కొండ"ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించేసి.. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని తొక్కేశాడట ఈ పిల్ల డాన్. అంతే కాదు మళ్లీ ఆ వ్యాపారం  పేరెత్తకుండా.. మూస్కుని కూర్చునేలా చేశాడంటే.. ఎలాంటి అవతారం ఎత్తాడో మీరే అర్ధం చేసుకోవాలి. 


"అధికార"మే మాది..?
గతంలో ఆయన వంశీయులకు అలవాటైన ఈ పని ఇప్పుడు సరికొత్త ట్రెండ్ లో నడిపిస్తున్నాడట కొత్త డాన్. ఢిల్లీ.. హైదరాబాద్ పేరుతో అటు ఇటూ తిరుగుతున్నానని చెబుతూనే.. ఆయన వ్యాపారాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నాడట. తన రాజకీయ పలుకుబడితో.. రెండు రాష్ట్రాల అధికారుల్ని వీజీగా మేనేజ్ చేస్తూ.. తన పనితనం ప్రదర్శిస్తున్నాడని అంతటా గుప్పుమంటోంది. అందులోనూ ఆయనకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయంటూ ధైర్యంగా బ్లాక్ మార్కెట్ ను ఏలుతున్నాడని.. ఆయన చేతులో నష్టపోయిన ఆసాముల మాట. ఆ వ్యాపారంలో కాకలు తీరిన యోధులంతా.. ఇప్పుడు ఈ కొత్త బాషాకు జై కొడుతున్నారంటే.. ఆయన ఏ రేంజ్ లో చక్రం తిప్పుతున్నాడో ఆలోచించాల్సిందేగా. నెక్స్ట్ వీక్ మళ్లీ ఇలాంటి నిజాలతో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.