విశాఖ ఎజెన్సీ గంజాయి సాగు గిరిజనులుకు ఆదాయ వనరు పంటగా మారింది..రాష్ర్టంలో ఏ మూల గంజాయి దోరికినా దాని ఆనవాలు విశాఖ జిల్లా లోనే లభిస్తున్నాయి..దీంతో రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తం అయింది..రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది..గంజాయిని శాశ్వతంగా నిర్మూలించడానికి గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ మార్గలుకు చుపనుంది...అసలు విశాఖ ఏజన్సీలో ఎన్నివేల ఎకరాలలో గంజాయి పంట సాగు అవుతుంది..గిరిజనులు ఎందుకు గంజాయి సాగు పట్ల అకర్షితులు అవుతున్నారు.
మన్యంతో గంజాయి సాగు రోజు రోజుకు ఉదృతమవుతుంది పదిహేనేళ్లు క్రితం హుకుం పేట మండలం మారుమూల ప్రాంతమైన సరసపాడు లో గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది దేశరాపల్లి మీదుగా గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించెందుకు వీలుగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు గిరిజనులకు భారీగా డబ్బుల ఇస్తు వారిని గంజాయి సాగులోకి దింపారు...అప్పట్లో కస్త ఆలస్యంగా గంజాయి తోటలు నిర్మూలన ఎక్సైజ్ శాఖ చేపట్టింది అప్పటికే ఇతర ప్రాంతాలకు గంజాయి సాగు పాకిపోయింది..ఎక్సైజ్ శాఖ కళ్లు గప్పి సుదూర అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు విస్తరించడంతో దిగుబడి ఎక్కువైయ్యింది...జి మాడుగులు, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు, హుకం పేట, డుంబ్రిగుడ, చింతపల్లి, మండలల్లొ గంజాయి సాగు జోరుగా సాగుతుంది ఈ ప్రాంతాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుంది..తమిళనాడు, కేరళ, మహరాష్ట్ర, ఓడిశా, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా ఇంకా ఇతర రాష్ట్రాలుకు చెందిన స్మగ్లర్లు మన్యంలో 3నెలలు మకం వేసి గిరిజనుకులు పెట్టుబడులు అందించి గంజాయి సాగు నిర్వహిస్తున్నారు...వరుస దాడులు చేస్తున్న టన్నులు కొద్ది దహనం చేస్తున్న భారీగా పట్టుకుంటున్న గంజాయి సాగు రవాణా ఆగడం లేదు ఎవోబి సరిహద్దు ప్రాంతాల్లో ఎక్సైజ్ దాడులు లేనందున గంజాయి దిగుబడి జోరుగా వెళ్లిపోతుంది..,, ఆగస్టులో సాగు మెుదలైయ్యి మూడు నెలల్లో పంట చేతికి వస్తుంది జనవరి నుండి రవాణా మెుదలవుతుంది తమకు ఉపాది కల్సిస్తు అటు వైపు పోమని గిరిజన రైతులు అంటున్నారు ఖాళీగా ఉండలేక వారి అడిగింది చేస్తున్నామని చేపుతున్నారు
అసలు విశాఖ మన్యంలోనే గంజాయి ఎందుకు సాగవుతుంది అనే ప్రశ్నలు ఉదయించక మానవు..ఇంత పెద్ద యంత్రాంగం ప్రభుత్వం చెతుల్లో ఉండి గంజాయి ఎలా ఎదేచ్చగా సరిహద్దులు దాటి వెలుతుంది అన్న సందేహాలు అందరికి రావడం జరుగుతుంది..ఏజన్సీలో మామ్మూలుగానే ఫోన్ సిగ్నల్స్ ఉండవూ..ఇదే సమయంలో మావోయిస్టుల బయంతో పోలీసులు రారు..దీంతో ఇదే అదనుగా దళారులు గంజాయి పంటను గిరిజనుల ద్వారా పండిస్తున్నారు..కేవలం సాగు అవుతున్న గంజాయిలో ఒక్క శాతం మాత్రమే పట్టుబడుతుంది అంటే ఎంత జాగ్రత్తగా అర్ధం అవుతుంది..వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండటంతో గంజాయి పంటకు ఉపయోగ పడే చల్లని వాతావరణం తో పాటుగా నీటి వనరులు అందుబాటులో ఉండటంతో గంజాయిలో లో అత్యధిక ధర పలికే శీలావతి గంజాయిని అధికంగా సాగు చెస్తున్నారు గిరిజనులు...
గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం కత్తిమీదసాము లాంటిదే ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు అన్ని విఫలం అవుతూనే ఉన్నాయి..2017 గంజాయి పూర్తి నిర్మూలనకు ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ ప్రణాళిక రూపోందించింది డ్రోన్స్ ఉపయెగించి పంటలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తంచి నాశనం చేయ్యాలని భావించిన కార్యరూపం దాల్చలేదు.ఎజెన్సీ ప్రాంతాంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు ఎక్సైజ్, పారెస్ట్, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ, సంయుక్తంగా ఉమ్మడి ప్రణాళిక ఒ వ్యహంతో కొత్త కార్యచరణ చేపటాలని భావిస్తున్నారు.. గిరిజనులు గంజాయి సాగు జోలికి పోకుండా ప్రత్యామ్నాయ జీవినోపాది అవకాశలును కల్పించాలని కాపీ సాగు తో పాటు పలు రకాలు పంటల వైపు మళ్లించాలని చుస్తున్నారు...గంజాయి సాగు చేసే గిరిజన రైతులను గుర్తించి వారికి ఉపాది కల్పించే దిశగా అడుగులు వెస్తున్నా పెద్గగా ప్రయోజనం కనిపించడం లేదు. గంజాయిని అక్రమంగా పండిస్తున్నదెవరు? ఆర్థికంగా అండదండలందిస్తున్నదెవరు? రవాణా చేస్తున్నదెవరు? నిల్వ చేస్తున్నదెక్కడ? అమ్ముతున్నదెవరు? వాడుతున్నదెవరు? తెరవెనుక ఉన్న ముఠాలేవి? అన్నింటిపైనా దృష్టి పెడతాం.. సరఫరా గొలుసును ఛిద్రం చేస్తాం. ఇకపై నూటికి నూరుశాతం దృష్టి సారిస్తాం. వారం రోజుల్లో గంజాయిపై యుద్ధం ప్రకటిస్తాం అంటూ పోలీసు ఉన్నతాధికారుల ప్రకటనలే మిగిలాయి.
3 రకాల సాగు..
‘విశాఖ జిల్లాలో మూడు రకాల గంజాయి పండిస్తున్నారు. ఇందులో సీలావతి రకాన్ని స్థానికంగా కిలో రూ. 1500కు కొనుగోలు చేస్తున్న దళారీ.. సంబంధిత వ్యాపారికి రూ. 3 వేలకు పైనే అమ్ముతున్నాడు. అంచెలంచెలుగా ప్రాంతాన్నిబట్టి ధర రూ. 12 వేలకు ఎగబాకుతోంది. కల్ల (రాజహంస) రకం ఇక్కడ కిలో రూ. 500కు అమ్మితే.. వినియోగదారుడికి చేరేసరికి రూ. 2 వేలు పలుకుతోంది. కాడ (కలపత్రి) రకం ఇక్కడ కిలో రూ. 200 పలికితే.. చివరకు రూ. వెయ్యికిపైనే చేరుతోంది.’
5 స్థాయిల్లో అక్రమాలు..
నిషేధిత గంజాయిలో సాగు, ఉత్పత్తి, నిల్వ, రవాణా/పంపిణీ, అమ్మకాలు కీలకమైన ఘట్టాలు. నిరుపేదలనే ఎంచుకుని.. వారి అవసరాలు తెలసుకుని పెద్దల నుంచి పిల్లల వరకు ఈ ప్రకియల్లో పావులుగా వాడుతోంది గంజాయి మాఫియా. వివిధ శాఖల్లోని కొంతమంది ఉద్యోగులనూ లోబరుచుకుని తన అడ్డు లేకుండా చూసుకుంటోంది.
9 మండలాల్లో తీవ్రత..
జిల్లాలో అనంతగిరి, పాడేరు, ముంచింగిపుట్టు, హుకుంపేట, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో గంజాయి సాగు అధికం. ఏఏ గ్రామాల్లో సాగవుతుందో అధికారుల దగ్గర సమచారం ఉన్నా నియంత్రించలేని పరిస్థితి.
10 వేలా..? 40 వేలా..?
ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో.. 10 వేల ఎకరాల్లో గంజాయి అక్రమంగా సాగవుతోందని కొందరంటే.. 40 వేల ఎకరాల్లో అని మరో వాదనా ఉంది. ఈ లెక్కన చూస్తే.. ఏటా రూ. 1500 కోట్లకు తక్కువ కాకుండా ఈ అక్రమ వ్యాపారం సాగుతోందన్నది అంచనా. మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో.. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యవహారం సాగుతుండడంతో ఇన్నాళ్లూ ఆ జోలికి ఎవరరూ వెళ్లలేదు.
అక్రమ రవాణా వ్యవస్థ ఇలా..
అక్రమంగా సాగు చేసిన గంజాయిని కాలి నడకన.. ఎండ్ల బళ్లు, గాడిదలు, గుర్రాలు.. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రక్కులు, బస్సులు, రైలు మార్గం, ప్రభుత్వ వాహనాల్లో రవాణా చేస్తున్నారు. ఇటుకలు, సబ్బులు, చాక్లెట్లు, వాహనాల సీటు కవర్లలో పెట్టి మరీ తరలిస్తున్నారు... 13 నడక మార్గాలో.. 28 వాహన మార్గాల్లో.. గంజాయి మన్యం నుంచి నగరానికి చేరుతోంది. ఇక్కడి నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్తొంది. ఆనందపురం, పినగాడి, గాజువాక, పెందుర్తి మార్గాలతోపాటు రైల్వే స్టేషన్ ప్రాంతాలపై పోలీసులు నిఘా పెంచారు.
ఇదీ మాఫియా సామ్రాజ్యం
ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్ తదితర ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు. ఇందులో స్థానికుల పాత్ర 80 శాతం ఉంటే.. 20 శాతం మంది పొరుగు రాష్ట్రాల వాళ్లున్నారన్నది అధికారిక లెక్క.
నగరంలోనూ నిల్వ కేంద్రాలు..
గాజువాక, లంకెలపాలెం, పెందుర్తి, గోపాలపట్నం గంజాయి అక్రమ నిల్వ కేంద్రాలున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు. జిల్లాలో జి.మాడుగుల, చింతపల్లి, పాడేరు, వి.మాడుగుల, ముంచింగిపుట్టు, హుకుంపేట, చోడవరం, అరకు మండలాల్లో నిల్వ కేంద్రాలున్నట్లు తేల్చారు. వీటిపై చర్యల్లో మాత్రం వైఫల్యం కనిపిస్తోంది. గంజాయి సాగుపై స్పష్టత లేదు.. అక్రమంగా సాగవుతున్న ప్రాంతాలేమిటో..? నిల్వ కేంద్రాలెక్కడో..? తెలిసినా.. ఇంతవరకు నియంత్రించే చొరవ లేదు. చివరకు గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు సాక్షాత్తూ డీజీపీలే ప్రకటించారు. మరి ఇప్పటికైనా అక్రమాన్ని అడ్డుకుంటారా? మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో సాగును అడ్డుకుంటారా? అక్రమ రవాణా మూలాలను నియంత్రిస్తారా..? సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా సాగును గుర్తించినా.. అక్రమ రవాణాపై నిఘా వేసినా.. చిత్తశుద్ధి ఉంటే తప్ప గంజాయి మాఫియాకు కళ్లెం వేసే పరిస్థితి లేదు.
తలాపాపం.. తిలాపిడికెడు..
గంజాయి మాఫియాలో అన్ని వర్గాల పాత్ర వెలుగు చూస్తోంది. అమాయక గిరిజనులు సహా విద్యార్థులు, యువకులు, రైతులు, వ్యాపారులకు ఎర వేసి ఈ అక్రమ వ్యాపారానికి వాడుకుంటోంది. పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ అధికారులతోపాటు, స్థానికంగా కొందరు విలేకర్లు గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో పట్టుబడిన సందర్భాలున్నాయి. తాజాగా చర్యల కోసం అధికారులు రంగంలోకి దిగితే స్థానికంగా ప్రతిఘటన ఎదురవటం అదుపు తప్పిన పరిస్థితికి అద్దం పడుతోంది.
ప్రతి సిమ్‌లో బోలెడు సిత్రాలు..
కొందరు పోలీసు, ఎక్సైజ్ అధికారులు, కింది ఉద్యోగులు అనధికారిక ఫోన్ నంబర్లు వాడుతూ గంజాయి అక్రమ రవాణాకు వూతమిస్తున్నారనే బలమైన ఆరోపణలున్నాయి. అక్రమాల లెక్కల కోసం నగరంలో కొన్నిచోట్ల ప్రైవేటు గదుల్లో భేటీ అవుతున్నట్లు సమాచారం. తేడాలొచ్చినప్పుడు మాత్రమే సరకు పట్టుకుంటున్నారు. మిగిలిన రోజుల్లో వాటి జోలికి వెళ్లడం లేదన్న వాదన బలంగా ఉంది. మన్యంలో గంజాయి మొక్కలను లెక్కేసి మరీ కొందరు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇవి అందినంత కాలం వాటి జోలికి వెళ్లరు. మరీ ఒత్తిడి ఎదురైతే మావోయిస్టుల బూచి చూపిస్తున్నారు. ఈ మాఫియాకు రాజకీయ దన్ను అదనపు బలంగా ఉంది.