ఏపీలో 2019 ఎన్నికల తర్వాత టీడీపీతో పాటు జనసేన కూడా ఢీలా పడిపోయాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాకుల మీద షాకులు తగులుతూనే వున్నాయి. ఆయన ఒకవైపు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా.. సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీలో వున్నారో లేదో తెలియడం లేదు. జనసేన నేతలు ఇప్పటికే పార్టీ వీడి వెళ్లిపోతున్నారు,
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వెళుతూ వెళుతూ పవన్ కళ్యాణ్ మీద ఘాటైన విమర్శలు చేశారు. పవన్ మళ్ళీ సినిమాల్లో నటిస్తుండటం వల్లే తాను పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు ఆయన తెలిపారు. గత కొంతకాలంగా పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఎన్నికల తరువాత అనేకసార్లు ఆయన ఆలోచనలను పక్కన పెట్టారని, ఇక తాజాగా అదే కోవలో మరో సీనియర్ నేత జనసేనకు రాజీనామా చేశారు.
గాజువాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం కనకారావు పార్టీని వీడారు. ఎప్పటినుంచో ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. పార్టీకి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నారు నేతలు. పవన్ కళ్యాణ్ తో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశమే లేకపోవడంతో నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెళుతూ వెళుతూ 200 మంది జనసేన కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు.