అక్కర్లేని పంచాయితీ...
మీ చెవి ఎక్కడుందీ అంటే.. ఏం చెబుతారు..? చక్కగా పక్కనే ఉందని.. ఎడం చెయ్యో..కుడి చెయ్యో చూపిస్తారు. కానీ.. ఆ ఊరి వాళ్లు మాత్రం వైద్యం ఎక్కడ కావాలంటే.. సూదూరాన చూపిస్తారు. పక్కనే ఉందని మాత్రం చెప్పరు. అదేంటి అంటే.. ఈ కధేంటో చూడాలి మీరు..
కధ ఇలా..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం శ్రీజగన్నాధపురం పంచాయితీకి ఆరోగ్య ఉపకేంద్రం అవసరం. ఇది దశాబ్ధాల కోరిక. కానీ.. అయిదారు పంచాయితీలకు అనువుగా ఈ వైద్య ఉపకేంద్రం మారిపోయింది. బుద్ధి ఉన్నోడు ఎవడూ చేయలేని పని ఈ అధికార యంత్రాంగం చేసి పెట్టింది. పొడుగుపాడు గ్రామంలో వైద్య ఉపకేంద్రం ఏర్పాటు చేస్తానని ప్రకటన చేసింది. దీని వల్ల.. ఉపయోగం.. ఆ ఒక్క గ్రామానికే. మిగతా అంతా.. అయిదు కిలోమీటర్లు చుట్టి రావాల్సిందే. మధ్యలో ఒక రోడ్డే కదా..? అంటే.. అది దాటాలంటే రూల్స్ ఉన్నాయండీ అంటోంది గ్రామం. ఇలా పంచాయితీ హెడ్ క్వార్టర్ కు రావాల్సిన ఆరోగ్య ఉపకేంద్రం ఇంకెక్కడో రావడం వల్ల.. వేలాదిమంది దిగాలు పడుతున్నారు.
అక్కడ ఎలా...?
మెయిన్ రోడ్ లో అవసరమా
అంటోంది గ్రామం. జిల్లా పై అవగాహన ఉందా అంటోంది గ్రామ ప్రజ. పంచాయతీ కేంద్రంలో ఉండాల్సిన ఉపకేంద్రం ఇంకెక్కడో ఉంటే ప్రయోజనం ఏమంటోంది గ్రామవాణి. ఈ గ్రామం రెండు పంచాయతీలకు సచివాలయాలకు హెడ్ క్వాటర్ గా ఉంది. అయిదు గ్రామలకు ఇది ఎంతో అవసరం కూడా. అలాంటి పంచాయితీ కేంద్రానికి కాకుండా పొరుగు గ్రామానికి వైద్య ఉపకేంద్రం ఎందుకని ప్రశ్న? అలాగే భవిష్యత్తులో ఈ గ్రామాలకు వెళ్లడానిక కూడా కనీసం అయిదు కిలోమీటర్లు వెళ్లాల్సిందేనని.. అందుకే అక్కడ వద్దంటున్నామని గ్రామస్థుల వినతి.
ఇదీ యదార్ధం..!
6 లైన్ ల రహదారి విస్తరణ పూర్తయిన తర్వాత ఈ గ్రామాలవారికి హైవేపై కటింగ్ ఉండదు. హరిశ్చంద్ర పురం..బస్టాండ్ వద్ద కు వెళ్ళి రావాలి. అంటే చుట్టూ తిరిగి రావాల్సిందే. ఇప్పటికే ఆరోగ్య పరంగా రాత్రి పూట ఇబ్బంది పడుతున్నారు
. జిల్లా ఆరోగ్య అధికారికి లేఖలు ద్వారా తెలియజేసిన సందర్భాలు అనేకం. ఆరోగ్య ఉపకేంద్రం రూరల్ గ్రామాలకు అందుబాటులో ఉండాలి. కానీ.. కొందరి పరపతి, స్వార్థం కోసం.. ఈ నిర్ణయం తప్పని భావిస్తున్నారు అక్కడి జనులు. హైవే అయితే కాలికి మట్టి అంటకుండా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారో ఏమో.. అధికారులు కూడా మొద్దు నిద్ర పోతున్నారక్కడ. కానీ.. వాస్తవ పరిస్థితి దృష్ట్యా.. అక్కడ ఉపకేంద్రం రాకూడదని.. శ్రీజగన్నాధపురానికే రావాలని కోరుతున్నారు. వేలాదిమంది ఆశ కాదని.. వందలాది కోసం ఆలోచిస్తారేమో.. ఈ పాలక పక్షం. చూడాలి మరి.