చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి

విశాఖపట్నం: గడచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటు దాదాపు మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తే రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు వెలుగు చూశాయన్నారు. మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ తప్పు లేదన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.