ఏపీ రాజధానుల తరలింపు, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ, రాజధానిలో భూముల కేటాయింపు పై జారీ చేసిన 107 జీవోను సవాలు చేస్తూ వేసిన అన్ని పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని అంశాలకు సంబంధించి వేసిన పిటిషన్లను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ విచారణ రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం.
రాజధాని తరలింపులకు కమిటీలను ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది అశోక్ బాన్ వాదించారు. ఉమ్మడి హైకోర్టుని అప్పట్లో ఉన్న స్థలం నుంచి గచ్చిబౌలి కి షిఫ్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2015లో తీర్పు చెబుతూ తెలంగాణ ప్రభుత్వానికి గానీ, శాసన సభకు గానీ అలా అడిగే హక్కు లేదని ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు పిటిషనర్ తరపు న్యాయవాది అంబటి సుధాకర్, పొన్నెగంటి మల్లిఖార్జున రావు.
హైకోర్టుని షిఫ్ట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ లో వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది. హైకోర్టు నిర్మాణం ఆపవద్దని, హైకోర్టు గురించి పిటిషన్లను ఒక బ్యాచ్ గా, కమిటీలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లు ఒక బ్యాచ్ గా వాదనలు వింటామని త్రిసభ్య ధర్మసనం పేర్కొంది. వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం విచారణ మధ్యాహ్నం తర్వాత కొనసాగించింది.
రాజధానికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సీఆర్డీఏ రద్దు,మూడు రాజధానుల బిల్లు, కర్నూలుకు కార్యాలయాల తరలింపు పిటిషన్లపై విచారణను వచ్చేనెల 30కి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కర్నూలుకు హై కోర్టు తరలింపుపై హై కోర్టులో వాదనలు జరిగాయి. ఇరువురు వాదనలు విన్న ధర్మాసనం విచారణను మార్చి17కి వాయిదా వేసింది.