టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్వకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేసవి తర్వాత ప్రారంభం కానుందట. అయితే సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పట్నుంచి ఎన్నో వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కథ ఇదేనంటూ, హీరోయిన్ ఈవిడేనంటూ అనేక గాసిప్స్ వచ్చాయి. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేదానిపై అటు మహేశ్ ప్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఆభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా వారికి ఊహకందిన పేర్లను సూచిస్తూ మహేశ్ సినిమాకు సంగీత దర్శకుడు ఇతడేనంటూ పేర్కొంటున్నారు.
మణిశర్మ, తమన్.. ఇప్పుడు అనిరుద్?