దొరంటే దోరే. పెండెం దొరబాబుకు ఆరునెలల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సోషల్ మీడియాతో పాటు.. మీడియా కూడా ఎక్కడా పల్లెత్తు మాట అనలేనంతగా.. పాలనలో పారదర్శకత కనిపిస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచీ ఆరునెలల్లో జీరో కరెప్షన్ దిశగా పాలన చేశారు. ఒకప్పుడు కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్న టీడీపీ పార్టీతో పోలిస్తే.. ఇప్పటి జగన్ పార్టీతో తాను కరెప్షన్ లేని నేతగా గుర్తింపు పొందారు.
అవును నిజం..? నో కరెప్షన్..
పిఠాపురం నియోజకవర్గం అంతా అవినీతికి ఎక్కువగా అవకాశాలు ఉన్న ప్రాంతం. నీటి పారుదలశాఖ నుంచీ సాధారణ శాఖ వరకూ అంతటా గతంలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. గతంలో ప్రతి ప్రాజెక్టు.. కరకట్ట పనులు.. ఏ చిన్న పనికైనా.. అంతా కోట్ల రూపాయలు అవినీతి కనిపించింది. అవినీతి ఆరోపణలు చేస్తే.. ఎవరైనా వేలెత్తి చూపితే వేలు తీసేస్తానని గతంలో టీడీపీ నేతలు బెదిరింపులు దిగిన పరిస్థితి ఉండేది. కానీ.. సీన్ మొత్తం రివర్స్. ఎక్కడా అవినీతి జాడ లేకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు దొరబాబు.
సాహసంతోనే..?
గతంలో ప్రభుత్వం రౌడీయిజం చేసిందనడానికి సాక్ష్యాలు ఎన్నో. అడిగిన వారందరి అంతు చూస్తామని చెప్పిన సందర్భాలు ఎన్నో. అయితే ఆ అధికార దుర్వినియోగానికి చరమగీతం పాడారు దొరబాబు. ఓటేసినందుకు జనాల మన్ననలు పొందుతున్నారు. బహిరంగంగానే అప్పట్లో ఎండగడతా అంటూ సవాల్ విసిరిన దొరబాబు.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు పిఠాపురం నియోజకవర్గలోనే చుక్కలు చూపిస్తున్నారని టాక్. తాము అధికారంలో ఉన్నామని ఏదైనా చేస్తామని, ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తల వైపు వేలెత్తి చూపితే అవి తీసేస్తానని మాజీ ఎమ్మెల్యే గతంలో చెప్పిన మాటల్ని ఆయన ధైర్యంగానే ఎదుర్కొంటున్నారు.
పాలకపక్షంలో న్యాయం..!
అప్పటి ప్రభుత్వం నిర్ణయాల్లో తప్పులు దొర్లాయి. కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. వై.ఎస్. జగన్ ప్రభుత్వం వచ్చింది. అప్పటి పాలక పక్షం చేసిన అధికార దుర్వినియోగాన్ని మొత్తం రూపుమాపారు దొరబాబు. ఆరునెలల పాలనలో ఎలాంటి మచ్చ లేకుండా నియోజకవర్గంలో పాలన సాగించారు. సిఎం జగన్ నుంచీ ప్రశంసలు కూడా అందుకున్న వారిలో దొర ప్రధమ స్థానంలో ఉన్నారు. ప్రతిపక్షాల ఆరోపణల్ని ఎదుర్కొని నిజాలు కళ్లకు కట్టినట్టు జనాలకు చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఇక ముందు కూడా దొరబాబు అయిదేళ్లలో అలాంటి పాలనే సాగించాలని కోరకుంటోంది అక్షరశిల్పం.