'కొత్త పలుకు' కాదు 'కుట్ర'పలుకు....!

చాలా కాలం తరువాత మళ్లీ "కౌటిల్యుని అర్ధశాస్త్రం" చదవడం మొదలు పెట్టాను. "కౌటిల్యుని అర్ధ శాస్త్రం" చదువుతున్నప్పుడు తెలియని శక్తి  నాలో  ఆవరిస్తోంది. నాలో  చాలా   ప్రశ్నల చిక్కుముడులకు"కౌటిల్యుని అర్ధశాస్త్రం" పరిష్కారం చూపుతుందనే నమ్మకం ఉంది. అలానే..భగవద్గీత వినడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు "ధర్మాన్ని కాపాడటానికి యుద్ధం తప్పదు" అంటారు.  ఆయుధాలు కింద పడేసి యుద్ధం చేయలేనని మొండికేసిన అర్జునుడికి ధర్మం కోసం హితబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు. " నీవు ధర్మాన్ని కాపాడు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది" అంటాడు శ్రీకృష్ణుడు.  కౌటిల్యుని అర్ధశాస్త్రానికి, భగవద్గీతకు చాలా  దగ్గర పోలికలు నాకు కనిపిస్తుంటాయి. రెండూ కూడా భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తుంటాను . అంతే కాదు..రెండింటింలోనూ రాజనీతి అంతర్లీనంగా ఉంటుంది.  రెండూ కూడా   గొప్ప మేనేజ్మెంట్‌ స్కిల్స్‌ను నేర్పించే బుక్స్‌. పాలకులు ప్రజలను ఎలా చూసుకోవాలి?. ధర్మాన్ని ఎలా కాపాడాలి?. అని కౌటిల్యుని అర్ధశాస్త్రం, భగవద్గీత చెబుతాయి. ప్రజల కోసం, భవిష్యత్తు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు  అవసరమని 'కౌటిల్యుని అర్ధశాస్త్రం 'చెబుతుంది. "పాలకులు నిర్ణయాల్లో స్వార్థం ఉండకూడదని..ప్రజా కోణంలోనే నిర్ణయాలు ఉండాలని" కౌటిల్యుడు పదేపదే చెబుతాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..జర్నలిస్ట్‌లు  కౌటిల్యునిలా రాజనీతిని  కాపాడాలి. అంతేకాదు..శ్రీకృష్ణుడిలా ధర్మానికి కట్టుబడి ఉండాలి. రాజనీతిని కాపాడటానికి, ధర్మాన్ని రక్షించడానికి  జర్నలిస్ట్‌ల కలాలు కట్టుబడి ఉండాలి. కాని..తెలుగురాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..?!. ఒక వర్గం మీడియా రాతలు రోత పుట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా 'కొత్త పలుకు' ఒక అబద్దాల పుట్టను కూడా తలదన్నేలా ఉంది. ఎంతకాడికి  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడం తప్పితే 'కొత్త పలుకు'లో అక్షరాలకు పనీపాటా లేకుండా పోయింది.!.


ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి చంద్రబాబుకు ఆయన వర్గం మీడియాకు నిద్రపడుతున్నట్లు లేదు. ఎందుకంటే..చంద్రబాబు సామాజిక వర్గం అధికారంలేకపోయినా తట్టుకోగలదేమో కానీ...ఆర్ధిక  ప్రయోజనాలు దెబ్బతింటేమాత్రం తట్టుకోలేదు.  ఇప్పుడు వారి  బాధ అమరావతిలో అధికారం పోయిందని కాదు.. అమరావతిలో రియల్ ఎస్టేట్  వ్యాపారానికి దెబ్బ పడుతుందని వారి ఆవేదన. తమ ఆర్ధిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి చంద్రబాబు అమరావతి రైతులను, ప్రజలను ముందు పెట్టి..జోలె పట్టి ఆంధ్రప్రదేశ్‌ వీధుల్లో నాటకాలు  ఆడుతున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ  ప్రజలు, నేతలు చంద్రబాబును ఘాటుగానే ప్రశ్నించారు.  "కరువు రాయలసీమ కోసం ఏనాడు జోలె పట్టని చంద్రబాబు ఇప్పుడు అమరావతి కోసం జోలె పట్టడంలో అర్ధం ఏంటీ?" అని రాయలసీమ  ప్రజలు, నేతలు టీడీపీ అధినేతను ఘాటుగానే  ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పరు. అలాగే..'కొత్త పలుకు'లో ఇటువంటి ప్రశ్నలకు చోటు ఉండదు. రాయలసీమ వాసుల శతాబ్దాల కష్టం, ఆవేదనలోంచి పుట్టుకొచ్చిన ప్రశ్నకు 'కొత్త పలుకు' రాసేవారు సమాధానం చెప్పగలరా?. ప్రజలు మాకు  అధికారం అప్పగించింది మా సామాజిక వర్గాన్ని అభివృద్ది చేసుకోవడానికే అన్నట్లు చంద్రబాబు పాలన సాగింది. దీనిపై ఏనాడైనా  చంద్రబాబును ఇదేంటనీ ' కొత్త పలుకు' కలం ప్రశ్నించిందా?. ఇప్పుడు సీఎంగావైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఉండేసరికి "అమరావతి సాక్షిగా అయోమయ  ఆంధ్ర "అంటూ 'కొత్త పలుకు' కలం కళ్లెం లేకుండా దూసుకుపోతుంది. 


'కొత్త పలుకు' అక్షరాలు ఒక్కోసారి నాకు చాలా కామెడీగా అనిపిస్తాయి. ఎందుకంటే..పెట్టుకున్న పేపర్, చేతిలో పెన్ను ఉందని ఏదిబడితే అదీ రాసుకుంటూ పోతే ఎలా?. ఆ అక్షరాలు ప్రజలను, పాలకులను ఆలోచింపచేసే విధంగా  ఉండాలి కాని..నవ్వులుపాలయ్యే విధంగా ఉండకూడదు. హైదరాబాద్‌కు అమరావతికి ముడిపెట్టారు. అసలు..హైదరాబాద్‌కు అమరావతికి  పోలిక ఏంటీ?. హైదరాబాద్‌కు 500 ఏళ్ల చరిత్ర ఉంది. అమరావతికి ఐదేళ్ల చరిత్ర లేదు. హైదరాబాద్‌ను మినీ భారత్ అంటారు.  భారతదేశంలోని అన్ని మతాల వారు, కులాల వారు, అన్ని ప్రాంతాల వారు హైదరాబాద్‌లోనివశిస్తుంటారు. అమరావతిలో మీ సామాజిక వర్గం వారు తప్పితే వేరే వారు నివశిస్తున్నారా?. నివశించాలని వచ్చినా మీరు బతకనిస్తారా?. సాక్షాత్తూ..ఎమ్మెల్యే మీదనే దాడి చేశారు. ఇక..అమరావతిలో సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది..?. ఎమ్మెల్యే మీద దాడి, ప్రభుత్వ విఫ్ అని కూడా చూడకుండా ఎలా ఎటాక్ చేసింది..? ఆ దాడి వెనుక ఎవరున్నారు?. ఇవన్నీ 'కొత్త చెత్త పలుకు'లో రాయరు.  రాయాలన్నా ఆ' కొత్త పలుకు'కు చేతులు రావు. ఇది జగమెరిగిన సత్యం. ఇక..దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం డల్‌గా ఉన్నప్పటికీ  హైదరాబాద్‌లో మాత్రం పరుగులు పెడుతుందని  రాశారు. కారణం..అమరావతిని మైలేజీని పడగొట్టడం వలనేనంటా?. ఈ మేరకు  వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డిని కేసీఆర్‌ తన సలహాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ' కొత్త పలుకు' వాపోయింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో అన్ని వర్గాల వారు లాభం పొందుతున్నారు. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. మరీ..అమరావతిలో భూములు ఎవరి దగ్గరున్నాయి..?. ధరలు ఎలా ఉన్నాయో?  కొత్త పలుకులో రాస్తే బాగుండేది. చివరకు  "మీ కులం ఏంటని అడిగి ఇళ్లు అద్దెకిచ్చే పరిస్థితి పరిస్థితి అమరావతిలో ఎందుకు దాపురించింది? ఎవరి వలనదాపురించింది?." ఇలా ఉంటే..భూములు కొనడానికి కాదు..ఇంటి అద్దెలకు కూడా ఎవరూ రారు అనే విషయం మీకు తెలియదా?


కార్యాలయాలు తరలించినంతమాత్రానా అభివృద్ది వికేంద్రీకరణ జరిగినట్లేనా ? అనేది 'కొత్త పలుకు'లో ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ అధికారిక భవనాలు తరలించవచ్చుకదా అని రాశారు.
హైదరాబాద్‌ అనేదితెలంగాణకు సూర్యుడిలాంటిది. జిల్లాలు అనేది గ్రహాలులాంటివి. ఆ హైదరాబాద్‌ అనే సూర్యుడి వెలుగు జిల్లాలు అనే గ్రహాల మీదపడకపోతే వాటి అభివృద్ది ఆగిపోతుంది. ఇక్కడ వెలుగు అంటే ఆర్ధిక వనరులు.ఇక.. అధికార వికేంద్రీకరణ అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు 10 జిల్లాలుమాత్రమేఉండేవి. ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. అంటే ..అధికార వికేంద్రీకరణ జరిగినట్లేకదా..?.  పరిపాలనను  ప్రజల దగ్గరకు తీసుకెళ్లడంలో కేసీఆర్‌ విజయం సాధించారు. ఇప్పుడు ఏపీలో జరగబోతుంది కూడా ఇదే..ప్రజలదగ్గరకు సచివాలయాల రూపంలోపాలన వెళ్లింది. హైదరాబాద్ అంత మహానగరం అమరావతి కాదు. హైదరాబాద్‌కు నెలకు వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అమరావతిపై నెలకు వేల కోట్లుపెట్టుబడి పెట్టాలి. అమరావతిపై కూడా ఆదాయం వస్తుంటే వదులుకోవడానికి  ఎవరూ సిద్దంగా ఉండరు. ఆదాయంలేకపోగా అప్పులు తెచ్చి పెట్టాల్సి వస్తుందనేగా అమరావతిని కాదని అధికార వికేంద్రీకరణకు తెరలేపింది. తెలంగాణలో హైదరాబాద్‌పై వస్తున్న ఆదాయంతో సీఎం కేసీఆర్‌ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. ఏపీలో అమరావతిలో పెట్టాల్సిన పెట్టుబడితో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు చేపట్టవచ్చు. 'కొత్త పలుకు'కు నేను ఇచ్చే సలహా ఏమంటే..దయచేసి  అమరావతిని  హైదరాబాద్‌తో పోల్చవద్దు. హైదరాబాద్ బంగారు గుడ్లు పెట్టే బాతు గుడ్డు. అమరావతి 'వైట్ ఎలిఫెంట్' రెండింటికి ఎంత తేడా అంటే....చెప్పాల్సిన పనిలేదనుకుంటా..!!. ఇక..13 జిల్లాలుగా ఉన్న ఏపీ 25 జిల్లాలుగా భౌళికంగా తన స్వరూపాన్ని మార్చుకోనుంది. ఈ లోపుగా  ఆర్ధిక దోపిడీ గద్దల రెక్కలు విరిచి ప్రజాధనాన్ని కాపాడి, మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించడానికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి  మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయంతో మూడు  ప్రాంతాలు ముచ్చటగా అభివృద్ది చెందడం ఖాయం. 



'కొత్త పలుకు'లో రాసినట్లు ఏనాడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏనాడు గర్భగుడిలో మూల విరాట్‌లా భావించలేదు. తనకు తాను ప్రజాసేవకుడిగానే భావించారు. తన మంత్రులకు , ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు కూడా ప్రజా సేవకులగా ఉండమని  హితబోధ  చేస్తుంటారు. విజ్ఞప్తులు స్వీకరించడం గొప్ప కాదు..ఆ విజ్ఞప్తులు ఎవరి ద్వారా వచ్చినా వాటిని పరిష్కరించే  గొప్ప మనసు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిది. 
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఎంత డబ్బు ఉండేది..?. వైఎస్‌ఆర్ సీఎం అయిన తరువాత  ముఖ్యమంత్రి సహాయ నిధి ఫండ్  ఎంతకు పెరిగింది?. 2014 నుంచి 2019 వరకు సీఎం సహాయ నిధిలో ఎంత బడ్జెట్ ఉంది..? వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టిన ఈ 8 నెలల్లో  ఎంత కేటాయించారు..?. 'కొత్త పలుకు' రాసే వారు తమ రిపోర్టర్ల చేత గణాంకాలు తీసుకుని..తెలుసుకుని రాస్తే పాఠకులకు వాస్తవాలు చెప్పినట్లుంటుంది. ఓ రైతు కుటుంబం ఇబ్బందుల్లోఉందని ఎవరో ఓ యువకుడు ఫేస్‌ బుక్‌లో వీడియో పెడితే..పూర్తి వివరాలు తెలుసుకుని సహాయం చేసిన మంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. 
 


తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌  యాదవ్‌కు సంక్రాంతి సందర్భంగా సన్మానిస్తే కూడా ఎల్లో మీడియా తట్టుకోలేకపోతుందంటే  ఆ మీడియా ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ మీడియా ఆలోచన ధోరణి  ఎంత విపరీతంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  మంత్రి తలసాని శ్రీనివాస్‌  యాదవ్  ప్రతి సంక్రాంతికి ఏపీకి వస్తారు. సరదాగా కోడి పందెలు చూసి వెళ్తారు. కోడి పందేలు , ఎడ్ల పందేలు, పోటేళ్ల పందేలు తెలుగు సంస్కృతిలో భాగం. అందులో భాగంగానే  మంత్రి తలసాని ఏపీ వచ్చారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన అతిధిని గౌరవించడం ధర్మంగా భావించారు వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు, తులాభారం వేశారు. దీనికి కూడా 'కొత్త పలుకు'లో గగ్గోలుపెడితే ఎలా?.  ఇక...అమరావతి గురించి మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అమరావతిలో ఏం జరిగింది?.    ఏం జరుగుతుందో..?. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కేటీఆర్‌కు బాగా తెలుసనే అనుకుంటున్నాను. 


కొన్ని రోజులుగా చంద్రబాబు మాటలు వింటుంటే..ఎల్లోమీడియా రాతలు చదువుతుంటే,  చర్చలు వింటుంటే వారికి ఏపీ త్వరగా అభివృద్ది చెందాలని లేనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శివరామకృష్ణన్ స్పష్టంగా చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు మూడు పంటలు పండే భూములు ఉండటం అదృష్టం. వాటిని నాశనం చేసి రాజధానిని కట్టొద్దు అని. కాని..చంద్రబాబు ఈ రోజున ఒక అబద్ధం పదే పదే చెబితే నిజం అవుతుంది. మనం చెప్పిన దానిని ఎల్లో మీడియా అదే పనిగాప్రచారం చేస్తుందని..శివరామకృష్ణన్ అలా చెప్పలేదని చెబుతున్నారు. చంద్రబాబు, కొత్త పలుకు రాసే వారు, టీడీపీ నేతలు ఓ సారి శివరామకృష్ణన్ కమిటీ ఏం మాట్లాడిందో, ఏం  చెప్పిందో వింటే బాగుంటుంది అని సలహా, సూచన. ఎందుకంటే..సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న  ఈ రోజుల్లో  ప్రజలను ఎవరూ మోసం చేయలేరు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి 5 నుంచి 6 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. ఆయన మంత్రి నారాయణ కూడా లక్షా 9వేల కోట్లు అవసరమవుతాయని ఈ మేరకు కేంద్రానికి నివేదిక కూడా పంపామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రజలు  గమనిస్తున్నారు..ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్ధం చేసుకుంటున్నారు.


కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి...చంద్రబాబును ఏదో అన్నాడని గిలగిలలాడిపోతున్నారు. ఎల్లో గ్యాంగ్ వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని సీఎం అనే గౌరవం లేకుండా మాట్లాడుతుంటే..'కొత్త పలుకు 'ఎందుకు స్పందించలేదు. 'కొత్త పలుకు'కు నత్తిఏమైనా వచ్చిందా? పెన్నులో ఇంక్ ఏమైనా అయిపోయిందా?. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని గౌరవం లేకుండా మాట్లాడుతుంటే ఇలా అనకూడదు..ఆయన సీఎం గౌరవించాలని  'కొత్త పలుకు'లో రాసి ఉంటే ఈ రోజున ద్వారంపూడి అలా స్పందించి ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు.  ఏ కార్యకర్తేనా,  ఏ నాయకుడైనా తమ అధినేతను ప్రత్యర్ది పార్టీల వారు మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోరు. ద్వారంపూడి చేసింది కూడా అదే. తమ అధినేతను టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే కాదు మేమూ అనగలమని నోటితోసమాధానం చెప్పారు. దీనిపై ఒకతను నాకు వాట్సాప్ మేసేజ్ కూడా చేశారు. తనది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గం అని పరిచయం చేసుకున్నారు. వాట్సాప్‌లో డీపీ చూస్తే ఆయనకు 60 ఏళ్లుపైగానే ఉంటాయి అనిపించింది. మంచి విద్యావంతుడిలాగానే కనిపించారు. హాలో అని మెస్సేజ్‌ చేశారు. ఎవరండీ మీరు..మీ పేరు ఏంటీ అని అడిగాను. పేరు చెప్పలేదు కాని..వైఎస్ఆర్‌ అభిమానిని అని పరిచయం చేసుకున్నార. ఏంటీ సార్ అన్నాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాటలు నాకు చాలా  బాధ కలిగించాయి. చంద్రబాబును అలా అనాల్సి ఉండాల్సింది కాదు అన్నారు. సార్‌...వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి  ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు..ఆయన ప్రతిపక్ష నాయకుడుఅన్న గౌరవం కూడా లేకుండా "నీవు మగాడివేనా జగన్‌మోహన్ రెడ్డి"అని మంత్రి హోదాలో ఉన్న ఆయన సభలో రెచ్చిపోయారు. ఇప్పుడు సీఎం అనే గౌరవం లేకుండా ..జగన్‌..జగన్‌.జగన్‌ అంటున్నారు.వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిగారు అని కూడా కనీసం అనడంలేదు.  ఇలాంటి వారు ఉన్న పార్టీకి అధినేతగా ఉన్న చంద్రబాబును ద్వారంపూడి అలా అనడంలోతప్పులేదండీ అన్నాను. ఇక..నెక్ట్స్‌ అటు నుంచి మెస్సేజ్‌ లేదు. ఎందుకో తెలుసా..నాకు మెస్సేజ్‌ చేసింది వైఎస్ఆర్‌ అభిమాని అని చెప్పుకున్నారు కాని కాదు. నాకు మెస్సేజ్‌ చేసింది  చంద్రబాబు అభిమాని. 


ఇక..అమరావతిపై జీఎన్‌ఆర్‌ కమిటీ నివేదిక ఇచ్చింది..బోస్టన్ నివేదిక వచ్చింది..హైపవర్ కమిటీ ప్రజంటేషన్ అయిపోయింది..ఇక ..సోమవారం కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతారు అనే దాని  కోసం  తెలుగురాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.