ఆయనకు ఆమె రక్షణ కవచం..!

 


భర్త విజయాలు వెనుక భార్య ఉంటుందని చిన్నప్పటి నుంచి చదువుకున్నాను..పెద్దలు చెబుతుంటే విన్నాను. దశాబ్దకాలంలో ఈ మాటలను ప్రత్యక్షంగా చూశాను. ఓ మహానేత చనిపోయిన తరువాత రాజకీయ ప్రకంపనలు ఎలా ఉంటాయో చూశాను.. సాక్షి టీవీలో రాశాను. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కష్టానికి అండగా ఉన్న వైఎస్‌ భారతి రెడ్డి పోరాటం చూశాను. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండి పోరాటం చేస్తే..ఆయన సతీమణి వైఎస్‌ భారతీ రెడ్డి ఆయన నీడలా ఉంటూ పోరాడారు. భర్త ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేశారు. భర్త నిర్ణయాలకు మద్దతుగా ఉన్నారు. భర్తే దైవంగా ముందుకు కదిలారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం టీడీపీతో కలిసి పన్నిన కుట్రలను భర్తతో కలిసి ధైర్యంగా ఎదుర్కొన్నారు. నాకు బాగా గుర్తు...వైఎస్‌ఆర్‌ చనిపోయిన రోజులు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఓదార్పు యాత్రకు అడ్డుపడుతుంది. ఓ పక్క వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మీద కల్పిత అవినీతి కేసులు. ఓ రోజు దిల్ ఖుష గెస్ట్ హౌస్‌లో ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ను అరెస్ట్ చేస్తారని ఉదయం నుంచి ఎల్లో మీడియా లీక్‌లు. వైఎస్‌ విజయమ్మతోపాటు వైఎస్‌ భారతీరెడ్డి, షర్మిలా రెడ్డి దిల్ ఖుష గెస్ట్ హౌస్ దగ్గరకు చేరుకున్నారు. దిల్ ఖుష గెస్ట్ దగ్గర ఫుట్ పాత్ పై బైఠాయించారు. ఓ సారి తన భర్తను చూడాలనుకున్నారు భారతీరెడ్డి, మాట్లాడాలి అనుకున్నారు..పోలీసులు అనుమతించలేదు. అంతేకాదు..10 మంది పోలీసులు భారతీరెడ్డిని చుట్టుముట్టారు. ఆ పోలీసులను భారతీరెడ్డి ఎదుర్కొన్న తీరు, ఆమెలోని కసి నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. బహూశ నేను చనిపోయే వరకు ఆ విజువల్స్‌ నా కళ్లలో ఉంటాయి. ఎందుకంటే.. ఆనాటి ఆ ఘటన నా కళ్ల వెంట నీళ్లు తెప్పించింది. నాటి నుంచి నేటి వరకు భారతీ రెడ్డి తన భర్త కోసం, ప్రజల కోసం అడుగులేస్తూనే ఉన్నారు.


భర్తే ప్రాణంగా అనేక బాధ్యతలు భజాన వేసుకున్నారు. కాంగ్రెస్‌ - టీడీపీ కుట్రలతో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో పార్టీని కాపాడటంలో తన వంతు పాత్ర పోషించారు. నేతలు, కార్యకర్తల్లో ధైర్యం నింపారు. ఓ పక్క రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతూనే మరోవైపు బిజినెస్ వ్యవహారాలను చక్కబెట్టారు. కంట్లో కన్నీరు ఉబికి వస్తున్నా దిగమింగుకుని భర్త కోసం రాక కోసం కోటి కళ్లతో ఎదురు చూశారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు కూడా భర్తను జైల్లో కలిసినప్పటికీ మనసు విప్పి మాట్లాడలేని నరకాన్ని భారతీ రెడ్డి అనుభవించారు. అన్నింటిని మనసు పొరల్లో దాచుకున్నారు. భర్త కోసం, తెలుగు ప్రజల కోసం మౌనంగా ముందుకు కదిలారు. మనసులో ప్రతిజ్ఞ చేసుకుని భర్త అడుగులో అడుగయ్యారు. ఆలోచనల్లో అంతర్ముఖులయ్యారు వైఎస్‌ భారతీ రెడ్డి.


నేను సాక్షి టీవీలో పని చేసే సమయంలో భారతీ రెడ్డి గారిని ఎప్పుడూ కలవలేదు. కాని..ఆమె కారులో వస్తూపోతూ ఉంటే చూసేవాడిని. ఆమెకు ఎదురుపడిన వాళ్లను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలకరించేవారు. ఆ నవ్వులో కల్మషం అనేది ఉండేది కాదు. ఆమె మాటల్లో ఎంతో స్ఫూర్తి ఉంటుంది. ఆమె మాటలు వింటే భయపడేవారు వారికి కూడా ధైర్యంగా పోరాడే శక్తి వస్తుంది.నేను అనుకునే వాడిని ఇన్ని కష్టాల్లో కూడా..రాజకీయ ప్రత్యర్ధులు మూకుమ్మడిగా చుట్టుముట్టి దాడి చేస్తుంటే మేడం ఎలా నవ్వుతున్నారు..? ఎలా ధైర్యంగా ఉంటున్నారు అనుకునే వాడిని..నాలో నేను ప్రశ్నించుకునే వాడిని..నాలో ప్రశ్నలకు భారతీ రెడ్డి గారి ధైర్యమే సమాధానమయ్యేది. ఆమెలోని పట్టుదలే సమాధానలు చెప్పేది. భర్త కోసం ఆమె పడిన కష్టాలు రాయలంటే అక్షరాలు కూడా కన్నీరు పెడతాయి. పదాలు కూడా మౌనంగా ఉండిపోతాయి, అంతగా ఆమె కష్టాలు ఎదుర్కొని భర్తకు అండగా ఉన్నారు.


వైఎస్ భారతీ రెడ్డిలో మానవతా విలువలు ఎక్కువ. పేదలు గురించి..అనాథలు గురించి ఆలోచిస్తుంటారు. వారికి చేతనైనంత సాయం చేయడానికి ప్రణాళికలు రచిస్తుంటారు. బదిరీల కోసం ఎన్నో నిధులు వెచ్చించి వైద్యం చేయిస్తున్నారు. ఆ కుటుంబం ఇవన్నీ బయటకు చెప్పుకోదు. మానవసేవే మాధవ సేవే అని వైఎస్‌ భారతీరెడ్డి భావిస్తుంటారు. ఎవరు కష్టాల్లో ఉన్నా చూసి భరించలేరు. చేతనైనా సాయం చేస్తారు. అండగా ఉంటారు. ధైర్యమిచ్చే మాటలు చెబుతారు. అందుకే..భారతీ రెడ్డి ..ఆమె భర్త జగన్‌మోహన్ రెడ్డితోపాటు కోట్ల మంది మనసులు గెలుచుకున్నారు. భర్త అడుగులే ఆరాధనగా వైఎస్‌ భారతీ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. భారతీరెడ్డిగారి లాంటి సతీమణి ఉండగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని రాజకీయ కుట్రలు ఏం చేయగలవు..?. ఎందుకంటే..వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి భారతీరెడ్డి ఓ రక్షణ కవచం.