గోదావరి జల్లాలో ఉత్తరాంధ్ర వాటాను బహుద వరకు తీసుకెళ్లాలి - మాజీ వైస్ ఛాన్సలర్ల డిమాండ్

ఉత్తరాంధ్ర భవిష్యత్ కార్యాచరణపై మేధావుల చర్చ జరిగింది. ఐదుగురు మాజీ వైస్ ఛాన్సలర్ లు ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ఆధ్వర్యంలో న్యూ కాలనీ లోని అక్షర ఇన్ హోటల్ లో మేధావుల చర్చ జరిగింది. ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక వ్యవస్థాపకులు, మాజీ వీసీ ఆచార్య కె యస్ చలం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి క్యాబినెట్ ఆమోదం తెలిపి 700 కోట్లు కేటాయించడాన్ని మేధావులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నీటి ప్రాజెక్టులకు 25 వేల కోట్లు ఖర్చు అవుతుందని, వాటికి నిధులను విడుదల చేయాలని కోరారు. ప్రధానంగా రైతుల వద్ద ఉన్న అసైన్డ్ భూములను వెనక్కి తీసుకొని ఇల్లు నిర్మించేందుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎస్సీ బీసీలకు ఈ భూములు కేటాయించారన్నారు .ల్యాండ్ పూలింగ్ విధానంలో వాటిని వెనక్కి తీసుకోవడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆయా భూములపై వ్యవసాయం ఫలసాయం చేసుకుని బతికుతున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. 
ఆక్రమణలో ఉన్న భూములు తిరిగి పూర్వ యజమానుల కే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలంటే వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్ లోనే 10 వేల ఎకరాలు ఖాళీగా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న నదుల నుంచి నీరు గోదావరిలో కలుస్తుందని , ఇక్కడి వాటా గా వచ్చే 50శాతం నీటిని నాగావళి మీదుగా బహుదా వరకు పొడిగించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనునట్లు చెప్పారు. గోదావరి జిల్లాల్లో డెల్టా ప్రాంతానికి వినియోగిస్తారు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న కోట్ల మందిని ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఇబ్బందులు కూడా లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని భూములను ఇతర జిల్లాల వారికి రిజిస్ట్రేషన్ జరగకుండా చట్టాన్ని అమలు చేయాలన్నారు. లేదా 1/70 చట్టాన్ని ఉత్తరాంధ్ర అంతటా అమలు చేయాలన్నారు.  విశాఖ రాజధానిపై శివరామకృష్ణ కమిషన్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలన్నారు. పరిపాలన రాజధాని విశాఖకు తరలించే క్రమంలో అవసరమైన మౌళిక వతులు ,నీటి సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. నగరానికి దూరంగా రాజధాని ఏర్పాటైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతుందన్నారు .పోలవరం ఎడమ కాలువ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఏయూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య కె.వి.రమణ నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య ముత్యం నాయుడు, జేఎన్టీయూ కాకినాడ మాజీ ఆచార్య విసి అల్లం అప్పారావు ,లా యూనివర్సిటీ మాజీ విసి వై సత్యనారాయణ, ఏయూ మాజీ రెక్టార్ ఆచార్య జగన్ మోహన్ రావు, ఏపీ బీసీ కులాల సమాఖ్య అధ్యక్షులు వేగి బాబురావు పాల్గొని మాట్లాడారు.