గవర్నర్‌తో ఈసీ భేటీ

ఎ‍న్నికలను వాయిదా నిర్ణయంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ కానున్నారు. సోమవారం ఉదయం పదిగంటల తరువాత వారి భేటీ జరిగే అవకాశం ఉంది. కాగా ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించే విధంగా ఈసీకి ఆదేశాలు  ఇ‍వ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. దీంతో​ వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.