కరోనా వైరస్ ప్రబలకుండా శుక్రవారం నుంచి సింహాచలం ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని సింహాచల క్షేత్ర కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర రావు ప్రకటించారు. గురువారం ఆలయ అనువంశిక ధర్మకర్త / చైర్మన్ సంచయిత గజపతిరాజు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో శుక్రవారం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించరాదని నిర్ణయించడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనల మేరకు ఆలయం లోకి భక్తులను అనుమతించడం లేదని, సేవలన్నీ కేవలం ఏకాంతంలోనే అర్చకులు నిర్వహిస్తారన్నారు. ఇప్పడికే ఆలయ పరిధిలోని కేశఖండన శాలను మూసివేయడం జరిగిందని, అన్న ప్రసాద కేంద్రంలో కేవలం ప్రసాద వితరణ మాత్రమే చేపడుతున్నారు. గురువారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆలయం లో కేవలం అర్చకులు మాత్రమే ఉంటారన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతి లేదన్నారు.
సింహాచలం ఆలయంలోకి భక్తుల ప్రవేశం నిషేధం - కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర రావు