ఏప్రిల్ , సెప్టెంబర్ నెలల్లో ఇండ్ల గణన - రాష్ట్ర గణాంక శాఖ డి. డి. సాయి శేఖర్

ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 45 రోజుల పాటు ఇండ్ల జాబితా, ఇండ్ల గణన వివరాలు  సేకరించాలని రాష్ట్ర గణాంక శాఖ ఉప సంచాలకులు సాయి శేఖర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ  సమావేశ మందిరం లో 2021 జనాభా గణన సక్రమ నిర్వహణకు సంబంధించి ఇండ్ల జాబితా, ఇండ్ల గణన, జాతీయ జనాభా రిజిస్టర్ యొక్క నవీకరణ  (NPR updation), సెన్సస్ 2021 తదితర అంశాలపై జిల్లా అధికారులకు,  ఛార్జ్ ఆఫీసర్స్ కు రెండు రోజుల శిక్షణా తరగతులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్ర గణాంక శాఖ ఉప డైరెక్టర్ శ్రీ సాయి శేఖర్  ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులయందు జనాభా గణన, 2021కు అవలంభించాల్సిన పద్దతులపై క్షుణ్నంగా అవగాహన కలిగించుకోవాలి అన్నారు.  ఈ సంవత్సరం జనగణన వివరాలు మొబైల్ యాప్ ద్వారా కూడా సేకరించవచ్చునని, అంశాల వారీగా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.