స్థానిక రిజర్వేషన్లలో పారదర్శకత లేకపోవడం అప్రజాస్వామికం - పెనుమల్లి మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి


స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకటించకముందే రాష్ట్ర ప్రభుత్వం మహిళకు, వివిధ సామాజిక తరగతులకు అన్ని స్థాయిల్లో రిజర్వేషన్లు వివరాలను రాజకీయ పార్టీల ముందుంచి వారి సలహా సూచనలు  తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేసే పద్దతి ఇప్పటి వరకు అములులో ఉంది. కానీ వైఎస్సార్‌ ప్రభుత్వం హడావుడిగా రిజర్వేషన్లు ఖరారు చేసి షెడ్యూల్‌ ప్రకటించిందని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి  పెనుమల్లి  మధు ఆరోపించారు . ఈ స్థితిలో కేటాయించిన రిజర్వేషన్లపై పార్టీలు, వివిధ సంఘాల అభిప్రాయాలు ప్రభుత్వం పరిగణలోనికి తీసుకునే పరిస్థితి లేదు. రిజర్వేషన్ల ఖరారులో అనేక చోట్ల అవకతవకలు జరిగినట్లు మాకు సమాచారం ఉంది. కొన్ని అంశాలను ఇప్పటికే ఎలక్షన్‌ కమీషన్‌ దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాపితంగా చూసినప్పుడు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు . కావున ఇది సరైంది కాదని ఇది అధికార పార్టీకే ప్రయోజనం చేకూరుతుంది. బహీనవర్గాలు, వివిధ సామాజిక తరగతులకు నష్టం వాట్లిల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ నిరసన తెలియజేస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారులో పారదర్శకతతో వ్యవహరించాలని, విధి విధానాలను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.


టిటిడి నిధుల్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టాలి
సంక్షోభంలో ఉన్న ఎస్‌ బ్యాంకులో టిటిడి నిధుల్ని పెట్టినట్లుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది ప్రజాధనం. పాలకవర్గం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ నిధుల్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే పెట్టాని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసారు.


మాన్సాస్‌ ట్రస్టు ఆస్తుల్ని జాతీయం చేయాలి
విజయనగరం జమీందార్ల ఆస్తుల్ని దొడ్డిదారిన ట్రస్టుకు మళ్ళించి ఒకే కుటుంబం అనుభవిస్తున్నది. చట్టాలను ఉల్లంఘించి భూములపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబంలోనే వివాదం రావడంతో ఈ సమస్య ముందుకొచ్చింది. ఈ ట్రస్టుకింద వేలాది ఎకరాల వ్యవసాయ భూములు, దేవాయాలు, విద్యాసంస్థలున్నాయి. పేదరైతులు సాగుచేసుకుంటున్న భూములను సాగుదార్లకే పట్టాలివ్వాలని, మిగతా భూముల్ని పేదవారికి పంచాలని డిమాండ్‌ చేస్తున్నాము. దేవాలయాలను ఎండోమెంట్‌ నిర్వహణకు తీసుకురావాలి. విద్యా వ్యవస్థల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తక్కువ ఫీజుతో పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.