కరోనా వ్యాధిపట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వుండాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు.పార్లమెంట్ సమావేశాలకు హాజరై తిరిగి గురువారం విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన శరీర ఉష్ణోగ్రత (థెర్మో స్క్రీనింగ్)తనిఖీ చేయించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వై .ఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో కరోనా పై నియంత్రణ సాధించామన్నారు.పూర్తి స్థాయిలో ఈ వ్యాధిని కట్టడిచేయడంలో ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు.ఈ క్రమంలో వైద్య,ఆరోగ్య శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
కరోనా వ్యాధిపట్ల అప్రమత్తం గా ఉండండి - విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ