గత కొంత కాలంగా తెలగు దేశం పార్టీ లో జరిగిన, చంద్రబాబు నాయుడు చర్యలకు మనస్తాపం చెంది పార్టీ ని వీడుతున్నట్లు టీడీపీ రూరల్ జిల్లా అద్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. బుధవారం బాలయ్యశాస్త్రి లే అవుట్ లో తన స్వగృహంలో పార్టీ కి,అద్యక్ష పదవి కి రాజీనామా చేస్తున్న లేఖను మీడియా కి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం అదినేత చంద్రబాబు నాయుడు విశాఖ ను పరిపాలన రాజదాని గా వ్యతిరేకించడం బాదా కరమన్నరు. తాను విశాఖ కు బ్రతుకు తెరువు కి వలస వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడి,రాజకీయాలు లో కూడా ప్రజల ఆధరణ పొందామన్నారు. అలాంటి విశాఖ పట్నం అభివృద్ధి కి కట్టుబడి వున్నామన్నారు. అమరావతి కి అనుకూలంగా కార్యక్రమాలు చేపట్టమని పార్టీ పలు మార్లు ఆదేశించినప్పటికీ వ్యతిరేకించామన్నారు. వేరే ప్రాంతం నుండి వచ్చిన నన్ను విశాఖ అదరించింది.ఇటీవల విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడంతో విశాఖ నాయకులు గా మేము స్వాగతించాము.అదే విషయం చంద్రబాబు కు చెప్పాము .కాని అమరావతే రాజధాని గా పోరాటం చేయ్యమన్నారు .అమరావతి రాజధాని గా నేను పోరాటం చేయ్యలేదు .అమరావతి రాజధాని గా పోరాటం చేయ్యలేదని టిడిపి రూరల్ అధ్యక్షుడు గా ఉన్న నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. ఇటీవల లోకేష్ హైదరాబాద్ లో కొంతమంది యువనేతలు విందు ఇచ్చారు..మరి 175 మంది నియోజకవర్గాల్లో కొంతమందే మీకు కావలా మిగిలిన వాళ్ళు వద్దా ఇది మంచి పద్ధతి కాదు. నన్ను పోమ్మనలేక పోగ పెడుతున్నారు .ఇప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా,వ్యాపారం మాత్రమే చేసుకుంటానన్నారు. కొత్తగా ఎలాంటి రాజకీయ పార్టీ లలో చేరాలని ఉద్దేశ్యం లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో సూర్యకుమార్ సేన్,రామ్మోహన్ పాల్గొన్నారు. గతంలో అనేక తప్పులు చేసాము. పక్క పార్టీ వ్యక్తులను తీసుకోని మంత్రి పదవులు ఇచ్చారు. మీ తనయుడు లోకేష్ కు ప్రజా బలంతో గెలవకుండా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ని చేసారు. ఇవన్నీ ప్రజలకు నచ్చలేదు అందుకే 23 సీట్లు ఇచ్చారు అని అన్నారు.
మనస్తాపం తోనే పార్టీ ని వీడుతున్నా -మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
• D prasad rao