ఎన్నికల్లో డబ్బులు పంచే సాంప్రదాయం పూర్వపు రోజుల్లో వుండేది కాదని, చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఈ సాంప్రదాయం మొదలైందని వైసిపీ నాయకుడు రెహమాన్ తెలిపారు. గురువారం వైసిపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తో కలిసి పార్టీ ప్రధాన కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో మద్యం,డబ్బులు పంపిణీ చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. దశల వారీగా మద్య పాన నిషేధాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అమలు చేస్తుంటే వ్యతిరేకంగా మాట్లాడటం దారుణమన్నారు. జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు లో రా ష్ట్ర వ్యాప్తంగా 95శాతం ఓట్లు వైసిపీ కే పడనున్నట్లు తెలిపారు. మైనారిటీ సంక్షేమానికి దివంగత నేత వై యస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలో సీనియర్ టీడీపీ నేతలు వుండగా విజయవాడ నుంచి రౌడీ ల వంటి నేతలను వెంటబెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు నాయుడు ని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా అవకాశ వాదతత్వమే అని ఎద్దేవా చేశారు. తొమ్మిది నెలల లో ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం నవరత్నాలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని కొనియాడారు.
ఎన్నికల్లో డబ్బులు పంచే సాంప్రదాయం తెచ్చింది చంద్రబాబే - వైసిపీ నాయకుడు రెహమాన్