బీసీలతో  పెట్టుకోవద్దు - మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

బీసీలతో  పెట్టుకోవద్దు మాడి మసైపోతావ్ అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘాటయిన పదజాలంతో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా  దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఎన్నికల్లో మద్యం, డబ్బు వినియోగించకూడదని సీఎం జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు జగన్ మోహన్ రెడ్డి చెప్పిన  మాటలు  వింటుంటే దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుందని జగన్ పై సెటైర్లు వేశారు. ఎన్నికలు నిలపడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేసినప్పటికీ  కోర్ట్ జోక్యం తో ఎన్నికలకు నోటిఫికేషన్  వచ్చిందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు  అయితే బిసిలు అంతా టిడిపి వైపు ఉన్నారని చెప్పుకొచ్చారు 24శాతం 34శాతం బిసి రిజర్వేషన్ తీసుకుని వెళ్లిన ఘనత  తెలుగుదేశం పార్టీదేనని ఉద్ఘాటించారు వివిధ కార్పొరేషన్ డబ్బులను అమ్మ ఓడి పధకానికి  మళ్ళించడానికి తప్పు పట్టారు. ఈ స్థానిక సంస్థ ఎన్నికలో ప్రజలు వైసీపీకి కి  గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు 34 శాతం నుంచి 27 శాతం తగ్గించడం వల్ల  స్థానిక సంస్థల ఎన్నికలో16000 బిసిలకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క విశాఖ జిల్లాలో 652 ఎంపీటీసీ లు ఉంటే 173 సీట్లు మాత్రమే బీసీ లకు ఇచ్చే పరిస్థితి రావడం చూస్తుంటే బీసీలకు ఎంత మేర తగ్గించారు అర్థమవుతోందన్నారు  బీసీ లకు నష్టం జరుగుతు ఉంటే ఎన్నికల సంఘం ఎలా చూస్తూ ఉరుకుంటుందని అని ప్రశ్నించారు. బిసి లను ముట్టుకుంటే మసి ఐపోతావు, బి సి ల జోలికి వెళ్లవద్దు జగన్ కు  హితవు పలికారు.ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడే  ఒక్క పని జరగలేదని ఆయన ఆక్షేపించారు  చెప్పిన పథకాలు అమలు చేయకుండా ,లబ్దిదారులను కొత కొస్తున్నారని దుయ్యబట్టారు మహిళా రుణ మాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా నేటికీ ఇవ్వలేదని  మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు  రైతు, మహిళ, వృద్దులు కన్నీరు కారిస్తే ఆ ప్రభుత్వం మట్టి కొట్టుకపోవడంఖాయం అని జోస్యం చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు