రాజధాని గా విశాఖ అనేది  ప్రజా ఆమోదంగా తీసుకున్న  నిర్ణయo -  ఎంపీ విజయసాయిరెడ్డి

రాజధాని గా విశాఖ అనేది  ప్రజా ఆమోదంగా తీసుకున్న  నిర్ణయమని  ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పేర్కొన్నారు. నగర వైయస్సార్ పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం జెండా ఎగుర వేసి, అవిర్బవ దినోత్సవాన్ని నిర్వహించిన ఎంపీ విజయ సాయి రెడ్డి  అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేయర్, డిప్యూటీ మేయర్, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను సీఎం జగన్ ఎన్నికల తరువాతే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు  48 కార్పొరేటర్ డివిజన్లకు అభ్యర్థులను  గురువారం  ప్రకటించనున్నట్లు  తెలిపారు.  రిఫరెండం అనేది మీడియా సృష్టి అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని ఇలా రిఫరెండంగా అపాదించవద్దు అని హితవు పలికారు. విశాఖలో లక్ష ఏబై రెండు వేల ఇళ్ల స్థలాలు అర్హులైన  ప్రజలకు అందించనున్నట్లు  విజయసాయి రెడ్డి తెలిపారు. వైసిపి ప్రభుత్వం చేసిన ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చూసి ప్రజలు జివిఎంసి ఎన్నికలో బ్రహ్మరధం  పడతారని ఆశ భావాన్ని వ్యక్తం చేశారు. పార్టీకి ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజల అండతో పార్టీ
తొమ్మిది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుందన్నరు. ఒడిదుడుకులు ఎదురైనా అప్పటికీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా
అధినేత జగన్ ముందుకు  సాగుతున్నారని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ తొమ్మిది నెలలు కాలం ఎన్నో అద్భుత పధకాలు అమలు చేశారని చెప్పారు. బడుగు బలహీన వెనుక బడిన వర్గాలను కొత్త హించడం సీఎం జగన్ కె  సాధ్యం అన్నారు. అన్ని వర్గాలను విజయపథం వైపుసీఎం జగన్. నడిపిస్తున్నరని విశాఖ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.