గత నెల ఆత్మహత్య చేసుకున్న కొత్తపల్లి దివ్య తల్లి కొత్తపల్లి అరుణ ఆమె బంధువులు శనివారం విశాఖ వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నువ్వు కలుసుకొని వినతి పత్రం సమర్పించారు పోలీసులు ఇప్పటి వరకు నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె దృష్టికి తీసుకు వెళ్లారు వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని చెబుతానని హామీ ఇచ్చారు. కమిటీ ఇచ్చిన వినతి పత్రం వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి అరుణ w/o కొత్తపల్లి సుధాకర్( లేట్ ,,)అనే నేను ఎస్ సి కులానికి చెందిన వారు. ఆమె భర్త డాక్ యార్డ్ లో పనిచేస్తూ మ్రృతి చెందారు. ప్రస్తతం పెన్షన్ తోనే బతుకుతున్నారు. ఆమెకు కొడుకు ,కూతురు ఉన్నారు. కుమార్తె దివ్యశ్రీ బీటెక్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని అనడంతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. నిశ్చితార్థం కూడా చేశారు. ఖర్చులన్నీ పెళ్లి కుమార్తె తరపున మేమె భరించి ,లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్నం కూడా ఇచ్చారు. 20లక్షల కట్నం, కానుకలు అడిగినప్పటికీ అందుకు అంగీకరించాము.
అయితే పెళ్లి కొడుకు కోన రాజశేఖర్ ,s/o సత్తిబాబు (ఆర్టీసీ ఉద్యోగి )మరో యువతితో తిరుగుతున్నట్టు తెలుసుకొని అడగడం జరిగింది. ఈ నేపధ్యంలో అతను పెళ్లి చేసుకోనని మొండికేశాడు.దీంతో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.వారు కౌన్సిలింగ్ ఇచ్చారు .అయినప్పటికీ పెళ్లి చేసుకోనని మోండికేశాడు. నువ్వు ఎస్సి కులం దానివి, నేను కాపు కులస్తుడిని, నేను కావాల్సి వచ్చిందా నీకు అని దుర్భాషలాడుతూ మెసేజ్ లు పెట్టాడు. గత నెల 16 సాయింత్రం కూడా ఫోన్ లో నానా దుర్భాషలాడుతూ తిట్టడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురై మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ రెండు వారాలు అవుతున్నా నిందితుడిని అరెస్టు చేయలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది.ఇటువంటి దుర్మార్గుడిని సమాజంలో తిరిగనీయకుండా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము.
మహిళా కమిషన్ ను కలిసిన రాజశేఖర్ బాధితులు