విశాఖపట్నం, ఏప్రిల్ 16: రాష్ట్రంలో అనుమానం వచ్చిన ప్రతి కేసును తప్పక పరిశీలించి kovid పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. సర్వే లను కచ్చితత్వంతో వేగంగా నిర్వహించాలన్నారు. విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ కోవిద్ పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. గత ఐదు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, పాజిటివ్ వచ్చిన 20 కేసులకు గాను 10 కేసులను డిశ్చార్జి చేశామని చెప్పారు. రానున్న ఐదు, ఆరు రోజులలో మిగిలిన వారికి కూడా పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవలే కేంద్ర బృందం వచ్చి కోవిడ్ ఆసుపత్రులను పరిశీలించారని, నెలకొన్న పరిస్థితులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఏ ఒక్క మరణం సంభవించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా మన్నారు. ఇటీవలనే మరిన్ని పరీక్షా పరికరాలు వచ్చినందున kovid పరీక్షలు వేగంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన పరీక్షలను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే సంతృప్తికరంగా ఉన్నదని, విశాఖ నగరం, గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు పోలీసులు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారని తెలియజేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో విశాఖపట్నం నుండి జాయింట్ కలెక్టర్లు శివశంకర్ వేణుగోపాల రెడ్డి సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ డిఎంఅండ్హెచ్ఓ తిరుపతి రావు డి సి హెచ్ నాయక్, కేజీహెచ్ సూపరిండెంట్ అర్జున్ ఏఎంసి ప్రిన్సిపాల్ సుధాకర్ డి ఆర్ డి ఏ పి డి వి. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
ఒక్క అనుమానిత కేసును విడిచి పెట్టవద్దు - ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి