భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ -19 కేసుల సంఖ్య 23,452 చేరుకుంది. ప్రస్తుతం 17915 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 4813 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి 724 చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్‌లో కొత్తగా 159 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,846కు పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 92 మంది మృతిచెందారు. కర్ణాటకలో 24 గంటల్లో కొత్తగా 29 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
24 గంటల్లో కొత్తగా 1752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు