కరోనా వైరస్ ప్రభావం తో దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరో సారి రాష్ట్రాల సీఎం లతో మాట్లాడనున్నారు. ఈ నెల 27 న అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ నున్నారు. లాక్ డౌన్ అమలు తీరు, కరోనా కేసుల నమోదు పై సమీక్షించనున్నారు. అలాగే, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, లాక్ డౌన్ మినహాయింపుల అంశం పైనా సమీక్షించ నున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కాన్ఫరెన్స్ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఈ నెల 27న సీఎం లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..