కరోనా నివారణకు పటిష్ఠ చర్యలు -    మంత్రి కన్నబాబు

 కరోనా వ్యాప్తి నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.      శుక్రవారం విఎం ఆర్ డి ఏ లో అధికారులు తో సమీక్షా సమావేశం నిర్వహించారు.  అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ లో కరోనా వ్యాప్తి నివారణ కేసు రాకముందే చర్యలు ప్రారంబించాం. 21కమిటీ లు వేశాం. కంటైన్ మెంట్ ఏడు ప్రాంతాల్లో మరింత దృష్టి సారించాల్సిన అవసరం వుంది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం అమలు చేస్తున్నాం. నిత్యవసర,వైద్య సిబ్బంది,ఇతర రోగాలు బారిన పడిన రోగులు,బ్యాంకింగ్ సర్వీసెస్ ఆపకుండా చర్యలు తీసుకుంటున్నాం.    విశాఖ క్వారంటైన్ లో 150మంది వున్నారు. రెండు వేల గదులు,ల్యాబ్ ఏర్పాటు చేశాం. ఇక్కడ పరికరాలు మెడిటెక్ లో తయారు అవుతున్నాయి. అర్హులు అందరి కీ రేషన్ సరఫరా చేస్తాం. ప్రతి తెల్ల కార్డు వారికి వెయ్యి రూపాయలు అందిస్తాం. రైతు బజార్ లు అదనంగా 33,52మొబైల్ బజార్ లు ఏర్పాటు చేశాం. పాయకరావుపేట లో కరోనా కేసు రావడం వలన ఆ ప్రాంతం అంతా అప్రమత్తం చేశాం. రైతులు కు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.  రైతు ఉత్పత్తుల కొనుగోలు లో కేంద్ర సహాయం మరింత అవసరం వుంది. షెల్టర్ లో వున్న వారికి క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి ఆదేశించాం. మీడియా ప్రతినిధుల విది నిర్వహణ లో ఆటంకాలు చేయొద్దు అని పోలీసులు కు సూచించాం. పీపీఈ,మాస్క్ ల కొరత లేదు. కొంత మంది చేస్తున్న దుష్ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. నిత్యవసర,వ్యవసాయ రవాణా లకు అడ్డు పెట్టరు. ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ  రేషన్ కార్డు లేని వారికి,పూరి గుడిసెలో వుండే 4800 మందికి కూడా స్వచ్ఛంద సంస్థలు ద్వారా   నిత్యవసర సరుకుల పంపిణీ చేస్తాం.పరిశ్రమ ల నుంచి విరాళాలు వచ్చాయి. నిబంధనలు ప్రకారం సమావేశం ఏర్పాటు చేసి సి ఎస్ ఆర్ నిదులు తో అవసరమైన వారికి సదుపాయాలు అందిస్తాం.   కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నారు. ఇది విమర్శలు చేసే సమయం కాదు.     ఈ మీడియా సమావేశంలో      ఎంపీ లు,ఎం వీ వీ సత్యనారాయణ,సత్యవతి,వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ రావు,జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్,జేసీ లు శివశంకర్,వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.