స్థానిక పెదవాల్తేర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో నిరాశ్రు లైన వలస కూలీలకు అంగలకుదురు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. బట్టలను సమకూర్చారు. ఈ సందర్భంగా అంగలకుదురు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ స్పందించి అందరిని ఆదుకోవాలని, తమవంతు సహకారం అందించాలని అన్నారు. ఈ కరుణ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ప్రభుత్వం చెప్పిన సంరక్షణ చర్యలు తప్పక పాటించాలని కోరారు. ఈ సందర్భంగా భోజనం సమకూర్చడంలో సహకరించిన అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బళ్ల అరుణ, హేమచంద్, సత్యనారాయణ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మురళి తదితరులు పాల్గొన్నారు
వలస కూలీలకు భోజనం ఏర్పాట్లు.