కరోనా వైరస్ తో శరీర అవయవాల విధులకు ప్రభావితం

కరోనా వైరస్ అంటే జలుబు దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ వైరస్ కొత్త పుంతలు తొక్కుతూ మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వైరస్ సోకితే గుండె మూత్రపిండాలు ఇతర శరీర అవయవాల విధులను ప్రభావితం చేస్తుందనే దాని గురించి ఇటీవల పరిశోధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండగా ఆ వైరస్లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా రోగులలో కొత్త లక్షణాలు వైరల్ సంక్రమణ ప్రభావాలను గుర్తిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారికి గుండె సమస్యలు మూత్రపిండాల వైఫల్యాలు కాలేయం దెబ్బతినడం రుచి వాసన కోల్పోవడం వంటివి గుర్తించారు.



కరోనా వైరస్ సరికొత్త స్ట్రాండ్ SARS-CoV-2 వల్ల వస్తుంది. ఈ వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. దగ్గు ఛాతీ రద్దీ జ్వరం మొదలైనవి కరోనా లక్షణాలు అని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం కరోనా రోగులలో ఇతర లక్షణాలను కూడా కనిపిస్తున్నాయి. ఆ వైరస్ ఊపిరితిత్తులకు హాని కలిగించడమే కాకుండా గుండె మూత్రపిండాలు ఇతర శరీర పనితీరును కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు గుర్తించారు. గుండె మంట తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి నాడీ పని చేయక పోవడం రక్తం గడ్డకట్టడం పేగు దెబ్బ తినడం కాలేయ సమస్యలకు కూడా కరోనా వైరస్ కారణమవుతుందని వాషింగ్టన్ పోస్ట్ లోని ఓ కథనం వెల్లడించింది. రుచి వాసన కోల్పోవడం పాదాల గాయాలు కూడా కొంతమంది రోగులలో కరోనా యొక్క సాధారణ లక్షణంగా నివేదించబడ్డాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులను భయ పెడుతున్నాయి. ఇటువంటి వాటితో నష్టం చికిత్సను క్లిష్టతరం చేస్తుంది. కరోనా తీవ్రమైన సందర్భాల్లో మరింత సమస్యలకు దారి తీయవచ్చు.

కరోనా వైరస్ ప్రధాన అంతర్గత అవయవాలను ఎలా ప్రభావితం చేస్తుంది. అధ్యయనాల ప్రకారం కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రెండు ప్రదేశాలలో చైనా న్యూయార్క్ వైద్యులు వైరల్ సంక్రమణ కారణంగా గుండెలో సమస్యలను నివేదించారు. ఈ సమస్యలలో హార్ట్ అరిథ్మియా ఉంటుంది. ఇది హృదయ స్పందన అవకతవకలను సూచిస్తుంది. కార్డియాక్ అరెస్ట్కు కారణమవుతుంది. కరోనా రోగులలో మయోకార్డిటిస్ అని కూడా పిలవబడే గుండె కండరాల వాపును గుర్తించారు. కరోనాతో హృదయ సంబంధ వ్యాధులు ఉన్నవారికి ప్రాణాంతకం కాగా గుండె సంబంధిత వ్యాధులు లేని రోగులలో కూడా గుండె గాయానికి కారణమవుతుందని వైద్యులు గుర్తించారు. దీంతో సర్వత్రా ఆందోళన కలుగుతోంది. ఇప్పుడు చికిత్స కు వినియోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మలేరియా నిరోధక ఔషధ చికిత్సలు కూడా పరిశోధకుల కొన్ని గుండె సమస్యలతో ముడిపడి ఉన్నాయి.