లాక్ డౌన్ తో కోట్ల మందికి ఉపాధి దూరమైంది. లక్షల్లో ఉద్యోగాలు కోల్పోయారు. ఆయా రంగాలు కుదేలు కావడంతో నిరుద్యోగ రేటు దేశంలో ఊహించలేనంతగా పెరగడం ఖాయం. లాక్డౌన్ ముగిశాక కూడా కరోనా భయంతో ఆయా రంగాలు నడిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఏ రంగాలపై కరోనా ఎంత ప్రభావం చూపుతుందనేది ఒక్కసారి విశ్లేషిద్దాం..
*ఎయిర్ లైన్స్ & ట్రావెల్స్
కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ వేయడంతో నిండా మునిగి అప్పుల పాలై.. కోలుకోని రంగం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఎయిర్ లైన్స్ పర్యాటకం ట్రావెల్స్ రంగాలే.. కరోనా వచ్చిందే విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా. దీంతో ఇప్పట్లో జనాలు విమానాలెక్కే అవకాశం లేదు. ఈ పరిణామం ట్రావెల్స్ రంగానికి పెద్ద బొక్క. ఇక ఈ విమానాలు ట్రావెల్స్ దెబ్బ పర్యాటకం పై భారీగా పడుతుంది. పర్యాటకమే ప్రధాన ఆదాయంగా ఉండే దేశాలు నగరాలకు కరోనా కోలుకోని దెబ్బ తీసిందని చెప్పవచ్చు. తాజాగా నిపుణుల అంచనా ప్రకారం లాక్ డౌన్-కరోనా ఎఫెక్ట్ దాదాపు 70-75శాతం ఈ రంగాలపై భారీగా పడుతుందని.. ప్రభావం చూపుతుందని తేలింది. దీంతో దాదాపు ఈ రంగాలు నష్టాల బాటలో పూర్తిగా దెబ్బతినే అవకాశాలున్నాయి.
*ఆటో అడ్వాన్స్ డ్ ఇండస్ట్రీస్
ఇక కరోనా తెచ్చిన లాక్ డౌన్ తో ప్రజల ఆదాయం పడిపోయింది. ఉద్యోగ ఉపాధి పోయింది. మళ్లీ పుంజుకోవాలంటే సంవత్సరం పడుతుంది. అప్పటివరకు కొత్త వాహనాలు పరికరాలు ఇత ఆటో ఇండస్ట్రీ ఉత్పత్తులు జనాలు కొనే పరిస్థితి లేదు. దీంతో ఈ రంగంపై కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ 50-60శాతం ఉంటుందని చెప్పవచ్చు.
*భవన నిర్మాణ & రియల్ ఎస్టేట్
కరోనా లాక్ డౌన్ తో కుదేలయ్యే మరో రంగం భవన నిర్మాణం మరియు రియల్ ఎస్టేట్. ఇప్పటికే లాక్ డౌన్ తో కోట్ల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. జనాల వద్ద దమ్మిడి ఆదాయం డబ్బు లేదు. దీంతో లక్షలు కోట్లు వెచ్చించాల్సిన కన్ స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ జోలికే పోరు. దీంతో ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పుడు జనాలు తిండికి నిత్యావసరాలకు తప్పితే ఈ భవన నిర్మాణాలు రియల్ ఎస్టేట్ లో భూములు ఇళ్లు కొనే పరిస్థితి అయితే రెండు మూడేళ్ల వరకూ ఉండదు. ఈ రంగంపై దాదాపు 50శాతం ప్రభావం పడుతుందని నిపుణుల అంచనా
*టెక్స్ టైల్
జనాల వద్ద కరోనా లాక్ డౌన్ తో డబ్బులన్నీ అయిపోయాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. దీంతో కొత్త దుస్తులు కొనే అవకాశాలుండవు. షాపింగ్ లకు అసలే పోరు. దీంతో టెక్స్ టైల్ రంగంపై.. దీని మీద ఆధారపడ్డ చేనేత కార్మికులపై తీవ్ర ప్రభావం పడనుంది. దీనిపై 50శాతం ప్రభావం పడుతుందని నిపుణులు అంచనావేశారు.
ఇక ఇవే కాకుండా ఫ్రైట్స్ లాజిస్టిక్స్ రంగంపై 40-45శాతం మెటల్ మైనింగ్ పై 35-40శాతం ఆయిల్ గ్యాస్ పై 20-25శాతం విద్యుత్ రంగంపై 20-25శాతం కన్య్జూమర్ రిటైల్ రంగంపై 20-25శాతం కెమికల్ రంగంపై 15-20శాతం అగ్రికల్చర్ పై 15శాతం ఐటీ సర్వీసులపై 10-15శాతం ఫార్మాస్యూటికల్స్ పై 10-15శాతం టెలికమ్యూనికేషన్స్ పై 0-5శాతం ప్రభావం పడనుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.
దీంతో లాక్ డౌన్ ఎఫెక్ట్ దాదాపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని అర్థమవుతోంది. జనాల వద్ద డబ్బులు లేక ప్రధానంగా విలాసాలకు దూరంగా ఉంటారు. అదే ఆయా రంగాలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు.