జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్...

కరోనా జర్నలిస్టులను వణికిస్తుంది...మహరాష్ట్ర, చెన్నైలలో జర్నలిస్టులు కరోనా బారిన పడటం సంచలనం కలిగిస్తుంటే తాజాగా తెలంగాణాలోని ఓజర్నలిస్టు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ న్యూస్ చానల్ విలేఖరికి (P1000) గురువారం నాడు కరోనా పాజిటివ్ గా తెలడంతో అతన్ని హుటాహుటిన గాంధీకి తరలించారు. అంతకు ముందే ఆయన కుటుంబంలో ఒకరికి పాజిటివ్ రాగ...తాజాగ సదరు విలేఖరికి పాజీటీవ్ రావడంతో జిల్లాలో కలకలం రేగింది. అతనితో సన్నిహితంగ ఉన్నవారిని క్వారంటైన్ చేశారు. గద్వాల జిల్లాలో కరోనా విజృభిస్తుండటంతో వైరస్ బారిన పడకుండ జర్నలిస్టులకు ఆయా పత్రికల యాజమాన్యాలు రక్షణ సౌ కర్యాలు  కల్పించాల్సిన బాధ్యత ఎంతైన ఉంది. తమిళనాడులో సన్ నెట్ వర్క్ తమ జర్నలిస్టులకు పీపీఈ కిట్లు అందించింది. ఇదే తరహలో తెలంగాణా మీడీయా సంస్థలు కూడ జర్నలిస్టులను కాపాడుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైన ఉంది. జర్నలిస్టులకు  కరోనా సోకిందనే వార్తల నేపథ్యంలో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది...