సెల్యూట్ టు ఐ టి పీపుల్

ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ..  ఐటి ఉద్యోగులు  మాత్రం, ఇళ్లే  కార్యాలయం గా చేసుకుని సేవలందిస్తున్నారు. వీరి సేవల వలన  అన్ని బ్యాంకింగ్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. స్టాక్ ట్రేడింగ్ దగ్గర నుండి అన్ని రకాల వ్యసస్థలు నడుస్తున్నాయి.  వెబ్‌సైట్లు, సాఫ్ట్ వేర్ వల్ల అన్ని ఆసుపత్రులు పనిచేస్తున్నాయి.   ఎటిఎం సాఫ్ట్‌వేర్ 24 గంటలు సజావుగా నడుస్తుందంటే, అన్ని వెబ్‌సైట్‌లను పనిచేస్తున్నాయంటే,  24x7 గంటలూ పనిచేస్తుండడమే.  ఐటి వ్యక్తులు నిర్వహించే సాఫ్ట్‌వేర్‌ల కారణంగా  ఫోన్లు కూడా పనిచేస్తున్నాయి.  ప్రతిరోజూ మిలియన్ల మొబైల్ లు ఉపయోగిస్తున్నారు. వీరందించే సాఫ్ట్‌వేర్‌ల కారణంగా అన్ని న్యూస్ ఛానెల్‌లలో నిరంతరాయంగా ప్రసారాలు  పొందుతున్నారు. అన్ని వినోద ఛానెల్‌లు వీరందించే సాఫ్ట్‌వేర్‌ల వల్ల పనిచేస్తాయి. పేస్ బుక్, వా ట్సాప్ మొదలైనవి ఐటి వ్యక్తుల కృషి చలవే.  అలాగే సోషల్ మీడియా, ఈ రోజు సమర్థవంతంగా పనిచేస్తోందంటే ఐటీ ఉద్యోగుల కృషి ఎంతో తెలుస్తుంది. ఐటి కారణంగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువులు కొనసాగిస్తున్నారు. 


ఒకటేమిటి ఫార్మాస్యూటికల్, సాఫ్ట్‌వేర్, ఐటీ  పరిశోధనలు , అన్ని ప్రయోగశాలల  పరీక్ష నివేదికలు ఐటీ  ఉద్యోగుల పనితనం వల్లే వీలవుతుంది. పవర్ గ్రిడ్‌ను నిర్వహించే సాఫ్ట్‌వేర్ ఐటిచే నిర్వహించబడుతుంది. కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌లు అవసరం లేని ఈ రోజు ప్రపంచంలో ఏదీ లేదు.  


ప్రాణాలను రక్షించే వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతలు 
 తెలుపుకుంటున్నారు. కానీ తెరవెనుక పనిచేన్న ఐటి యువతకు మరింత అధికంగా అభినందనలు తెలుపాల్సిన అవరం వుంది. వీరు ఇటీ 'సేవలు అందించక పొతే, ఎటువంటి సేవలు అందించే పరిస్థితి లేదన్నది జగమెరిగిన సత్యం.  నిజంగా వీరు అభినందనీయులే.. . సెల్యూట్ టు ఐ టి పీపుల్...