పారదర్శకంగా పరిహారం





 





విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు నేడు  నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.  పారదర్శకంగా పరిహారం అందివ్వాలని సీఎం తెలిపారు. విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలోని గ్యాస్ లీక్ జరిగిన దుర్ఘటనలో 12మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంకా వందలాది మంది నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల కుటుంబాలతో పాటు.. బాధిత కుటుంబాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నష్టపరిహారం ప్రకటించారు. అయితే గ్యాస్ లీకేజీ బాధితులందరికీ ఈ పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటుంది ఏపీ సర్కార్. ఇవాళే గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితులకు నష్ట పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కుటుంబీకుల వద్దకు మంత్రులు ఉన్నతాధికారులు వెళ్లి వెంటనే పరిహారం అందజేయాలని తెలిపారు. ఈ పరిహారం కోసం ప్రజలు పదేపదే తిరగకుండా పారదర్శకంగా ఈ పరిహారాన్ని అందరు చేయాలంటూ తెలిపారు. అంతే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయా గ్రామాల్లో మంత్రులు బస చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు.