నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో టాస్క్¬ఫోర్స్ బృంధాల పనితీరును సంయుక్త కలెక్టరు ఎల్. శివశంకర్ అభినందించారు. శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో టాస్క్ ఫోర్స్, విజిలెన్స్, తూనికలు, కొలతలశాఖ అధికారులతో ధరల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.
సవరించిన ధరలను దుకాణదారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూఉండాలని ఆదేశించారు. రైతుబజార్లలో నిర్ణయించిన ధరలే అన్నిచోట్ల అమలవుతాయని, సవరించిన ధరలు వెబ్ సైట్ లో ఉంటాయన్నారు. దుకాణదారులు, ప్రజలు వెబ్ సైట్ లో సవరించిన ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ పోస్టర్లు ప్రతి షాపు వద్ద ఏర్పాటుచేయాలన్నారు. మాంసం, చేపలు అధికధరలకు అమ్ముతున్నట్లు పిర్యాదులు ఉన్నందున వాటిని కూడా నియంత్రణ పరిధి లోనికి తీసుకువచ్చి, రిటైల్ ధరలు నిర్ణయించాలని అధికారులకు సూచించారు.
శనగపప్పు ధరలో ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తున్నదని, దుకాణదారులు రేటు పెరిగిందని చెబుతున్నారని అధికారులు తెలుపగా, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించినందున, ధరల పెరుగుదలను అదుపుచేయాలని, దుకాణాలలో తనిఖీలు చేసినప్పుడు తప్పులు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విజిలెన్స్, తూనికలు,కొలతలు శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ గా నియమించబడ్డ జిల్లా అధికారులు, ఎన్.ఐ.సి. సెంటరు అధికారి బాషా తదితరులు పాల్గొన్నారు.