నిబంధలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు - డీజీపీ గౌతమ్ సవాంగ్ 


నిబంధనలు ఉల్లంఘించే మద్యం కొనుగోలుదారులపై కఠినంగా  వ్యవరిస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మద్యం కొనుగోలుదారులు కచ్చితంగా  నిబంధనల పాటించాలని, లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నిర్ణీత సమయంలోనే షాపుల వద్ద క్రమపద్దతిలో విక్రయాలు జరపాలని, మద్యం కొనుగోలుకు వచ్చే వారు ఖచ్చితంగా దుకాణాల వద్ద  భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఖచ్చితంగా మాస్క్ దరించాలని, మద్యం  దుకాణల వద్ద గుంపులు గుంపులుగా గుమికుడరాదన్నారు. 
నిభందనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తామని,  మద్యం సేవించి గొడవలకు దిగడం, ప్రశాంతమైన వాతావరణానికి భంగం  కల్పించటం చేస్తే జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యల తీసుకుంటామని తెలిపారు. వివాదాలు సృష్టించే వారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంటుందని వివరించారు.