ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రణస్థలం మండల కోష్ట వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులు విశాఖపట్నం నుంచి కారులో పలాస వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. కారులో డ్రైవర్ సహా నలుగురు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. వేగంగా వాహనం నడిపి ముందు ఆగి ఉన్న వాహనం గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగింది.
బాధితులను మందస మండలం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిని ఢిల్లీశ్వరరావు (22), వసంత (19) గుర్తించారు. ప్రమాదం గురించి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.