ఎల్ జి పాలిమర్స్ దగ్గర గల 5 గ్రామాలలో సాధారణ స్థితి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పారు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ ముత్తంశెట్టి శ్రీనివాసరావు వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ లతో కలిసి ఆయన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్యాస్ సంఘటన జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నదని చెప్పారు. ఉన్నతాధికారులు, నిపుణులతో ఆదివారం రెండు దఫాలుగా సమీక్ష సమావేశం నిర్వహించామని, వీలైనంత తొందరగా పరిస్థితులను చక్కదిద్ది సురక్షిత వాతావరణం తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉష్ణోగ్రత పారామీటర్స్ 98.4 డిగ్రీలు నుండి ఈ రోజు సాయంత్రానికి 92.6 డిగ్రీలు కు, ఈ విధంగా విషవాయు గాఢతను కూడా లెక్క కట్టగా కర్మాగారం గేటు వద్ద అధికంగా 0.5, గ్రామాలలో 0.1, 0.3 రికార్డు కాగా గోపాలపట్నం పెందుర్తి వేపగుంట లో 0.1 గా నమోదైందన్నారు. అన్ని ప్రాంతాలలో 0.0 కి వచ్చిన తర్వాత 24 గంటలు పరిశీలన చేస్తారని సురక్షితంగా ఉన్నదని నిపుణులు ప్రకటించిన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
బాధితులు పూర్తిగా కోలుకుంటున్నారని కేజీహెచ్లో 287 ప్రైవేటు ఆసుపత్రుల్లో 69 మొత్తం 356 మంది ఇన్ పేషెంట్ లు ఉన్నట్లు వెల్లడించారు. పూర్తిగా కోలుకున్న వారిని వెంటనే డిస్ఛార్జ్ చేసేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. పూర్తిగా కోలుకున్న వారిని తరువాత కూడా ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. బాధితులందరికీ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ప్రభుత్వం ఖర్చుతో సహాయ సహకారాలు ప్రత్యేక సదుపాయాలు, పునరావాసం భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 24 గంటలు ఉన్నతాధికారులు గ్రామస్తుల పరిస్థితులను తెలుసుకొని, వారు ఎక్కడున్నా భోజన వసతి కల్పిస్తారు అన్నారు. ఎల్ జి పాలిమర్స్ యాజమాన్యం కొరియా లో ఉన్న మాతృ సంస్థ అధికారులతో రాష్ట్ర కేంద్ర జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారని, ఇరు దేశాల రాయబారులు కూడా పాల్గొన్నారని చెప్పారు.
కమిటీలు ప్రధానంగా మూడు అంశాలపై పరిశీలన చేస్తారన్నారు లీకైన విషవాయువుల మూలంగా ప్రజారోగ్యంపై ప్రభావం, పర్యావరణ పరిస్థితులు పై ప్రభావం, మానవ జంతు వృక్షాల జీవనంపై ప్రభావాన్ని పరిశోధిస్తారన్నారు. అక్కడి గాలి నీటి నమూనాలను పరీక్షిస్తారని, భవిష్యత్తు జాగ్రత్తలు భద్రతలు పై నివేదిక అందిస్తారని తెలిపారు. వివిధ అంశాలపై 6 కమిటీలు పరిశీలన, పరిశోధన జరుపుతున్నట్లు వెల్లడించారు. రసాయనిక పరిశ్రమలను తనిఖీ చేయిస్తామన్నారు.
పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంఘటన జరిగిన ప్రాంతం లోని అయిదు గ్రామాలలో పూర్వపు పరిస్థితి వరకు మంత్రులు ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగం విశ్రమించ కుండా పనిచేయాలని ఆదేశించారని చెప్పారు. దాని ప్రకారమే యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం ప్రజారోగ్యం, ప్రజారక్షణ లో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని, మేధావులు, సామాజిక కార్యకర్తలు మానవతా కోణంలో తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. సంఘటన జరిగిన గ్రామాలో పోలీసు వారు ఇళ్లనుతమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తున్నారని, నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని చెప్పారు.