విశాఖ నగరంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. గురువారం జరిగిన ఘటన తో ఒక్కసారిగా ఉలిక్కిపడిన నగరం ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోలేకపోయింది. పాలిమర్స్ కంపెనీని వెంటనే మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పాలిమర్స్ లో జరిగిన ఘటన తో. విషవాయువు వెలువడడంతో ఆ ప్రాంత ప్రజలందరూ అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అందులో కొంతమంది మృతి చెందారు దాదాపు వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు కాగా అందులో 11 మంది వరకు చనిపోయారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విశాఖ నగరానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ముందుగా కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన సీఎం ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని బాధితులకు ధైర్యాన్ని నూరిపోశారు. మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించగా ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు అలాగే సాధారణ చికిత్స పొందుతున్న బాధితులకు లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వనున్నట్టు తెలియజేశారు.
ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన ఎల్జి పాలిమర్స్ యాజమాన్యంపై 03:37 38 వంటి పరి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్ గానే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఫోన్ చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ వివరాలు తెలుసుకున్నారు. పరిశ్రమల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను వల్లం గించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు లార్డ్ నేపథ్యంలో పరిశ్రమలో నిర్వహణ లేకపోవడం వల్ల విషవాయువు నీకై ప్రాణం మీదకు తెచ్చిన దని ఎల్జీ పాలిమర్స్ డైరెక్టర్ తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్న ఆయన గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చిందని తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిపై ఆరా తీశారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న పరిచయం గురించి అధికారులతో మాట్లాడి, తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఎల్జి పాలిమర్స్ ఘటనపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, విచారణకు ఆదేశించింది. ఈ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఈ ప్రాంత ప్రజలంతా ఎల్జి పాలిమర్స్ కంపెనీ మీద దండయాత్ర ఇది గారు. అయితే, పోలీసులు వీరిని అడ్డుకొని నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారు. ఈ ప్రాంతంలో ఎల్జి పాలిమర్స్ కంపెనీని మూసివేయాలని ఎక్కడి నుంచి దూరంగా తరలిస్తే గాని, మేము ఊరుకోమని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఎల్జి పాలిమర్స్ సంస్థ ఏర్పాటు దగ్గర్నుంచి చిన్న చిన్న ఘటనలు జరుగుతుండగా, నిన్న జరిగిన ఘటన చాలా పెద్దదైన చెప్పొచ్చు. గతంలో జరిగిన సంఘటనలు పై స్థానికంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ, అప్పటి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు దీంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోయింది యూనియన్ నేతలు ఎప్పటికప్పుడు కంపెనీ యాజమాన్యం పై ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ ఏం ఫలితం లేకుండా పోయింది. పరిశ్రమల శాఖకు పలు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోక పోవడం వల్లే ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదకరమైన విషవాయు ట్యాంకుల నిర్వహణ లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు.